Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్ గురించి సింగర్ సునీత ఏం చెప్పారంటే..?

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (11:35 IST)
సింగర్ సునీత గురించి రోజుకొక రకంగా వార్తలు వస్తున్నాయి. సునీత దంపతులు హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళబోతున్నారని రూమర్లు క్రియేట్ చేసారు. అక్కడైతేనే ఏకాంతానికి ప్రశాంతత ఉంటుందని, సునీత ఏరి కోరి భర్తతో మాల్దీవులకు ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ రూమర్ల పై సునీత క్లారిటీ ఇస్తూ.. 'కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకోవాలనుకున్నాం. అందుకే కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానించడం జరిగింది. అయితే మా రెండు కుటుంబాలు చాలా పెద్దవి కావడంతో.. అతిథుల జాబితా 200కు చేరింది. 
 
అయితే, ముందు తాము వెళ్లి కలవాల్సిన వాళ్లు చాలామందే ఉన్నారు. అలాగే వారికి చిన్న చిన్న పార్టీలు కూడా ఇవ్వాలి. అలాగే కొన్ని గుళ్ళకు కూడా మేం వెళ్ళాలి. అవ్వన్నీ పూర్తైన తరువాతే మా హనీమూన్ ను ప్లాన్ చేస్తాము. అయితే, హనీమూన్ కోసం మేము మాల్దీవులకు వెళ్ళబోతున్నామని అంటున్నారు, గాసిప్స్ కూడా వచ్చాయి. ఒక్కటి అయితే నిజం మా హానీమూన్ కోసం మంచి ప్లేస్‌కి ఎక్కడికైనా వెళ్తాం' అని చెప్పుకొచ్చింది సునీత.
 
ఇక తన కొత్త శ్రీవారి గురించి చెబుతూ 'రామ్ నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. ఆయన నా సోషల్ మీడియా అకౌంట్స్‌ని మెయిన్‌టైన్ చేసేవాడు. అలా మా ఇద్దరికి పరిచయం, ఆ పరిచయం స్నేహంగా మారి.. ఈ బంధం వరకూ తీసుకొచ్చింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. మన కష్ట సుఖాల్లో అండగా నిలిచే వ్యక్తి భాగస్వామిగా దొరకడం అదృష్టం. రామ్‌ రూపంలో నాకు ఆ అదృష్టం లభించింది. అయితే రామ్‌తో పెళ్లి ఆలోచన వచ్చినప్పుడు నాకు నా పిల్లలే గుర్తుకువచ్చారు. నా పెళ్లి నిర్ణయాన్ని నా పిల్లలతో పంచుకున్నప్పుడు వాళ్లు చాలా సంతోషించారు... అంటూ సునీత వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments