Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నదమ్ముల సవాల్, స్టాలిన్‌కు సీఎం పీఠం అందకుండా అన్న అళగిరి ప్లాన్స్?

అన్నదమ్ముల సవాల్, స్టాలిన్‌కు సీఎం పీఠం అందకుండా అన్న అళగిరి ప్లాన్స్?
, సోమవారం, 4 జనవరి 2021 (18:42 IST)
ఒకప్పుడు డిఎంకే అధినేత కరుణానిధి రాజకీయాల్లో ఒక ఊపు ఊపారు. అలాంటి ఇలాంటి ఊపు కాదు జయలలిత, కరుణానిధి మధ్యే మొత్తం రాజకీయాలు తిరిగేవి. అన్నాడిఎంకే నుంచి జయలలిత, డిఎంకే నుంచి కరుణానిధిలు మాత్రమే సిఎం అయ్యేవారు.
 
ఇక డిఎంకేలో ప్రధాన నేతగా ఉన్నారు కరుణానిధి కుమారుడు స్టాలిన్. కరుణానిధి మరణించక ముందే ఆయన పెద్ద కుమారుడు అళగిరి పార్టీ నుంచి బయటకు పంపేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అళగిరిని పార్టీ నుంచి పంపేశారు. అయితే అప్పటి నుంచి అళగిరి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. 
 
త్వరలో తమిళనాడు ఎన్నికలు జరుగబోతోంది. ఇలాంటి సమయంలో రజినీకాంత్ సొంతంగా పార్టీ పెడుతున్నారని ప్రచారం సాగింది. ఆయన పార్టీ పెట్టడానికి సిద్థమయ్యారు. అనారోగ్య సమస్యతో చివరకు వెనక్కి తగ్గారు. ఇదంతా జరిగిపోయింది. అయితే రజినీ పార్టీ పెడితే డిఎంకే గెలుపు సాధ్యం కాదని అళగిరి భావించారు.
 
అన్నాడిఎంకే గెలవడం ఏ మాత్రం సాధ్యం కాదని విశ్లేషకుల భావన. పళణిస్వామి, పన్నీరుసెల్వం ఇద్దరు కూడా పార్టీలో నాయకులే తప్ప పార్టీని నడిపించే సత్తా వారికి లేదని..దీంతో ప్రత్యామ్నాయం డిఎంకే మాత్రమేనని అందరూ భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో అళగిరి తమ్ముడు స్టాలిన్ పై పగతీర్చుకోవడానికి సిద్థమయ్యారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.
 
డిఎంకేలో తనకున్న పరిచయాలతో ఆ పార్టీలోని నేతలను బయటకు తీసుకొచ్చి పార్టీని చీల్చి చివరకు స్టాలిన్ ను ముఖ్యమంత్రి కానివ్వకుండా అడ్డుపడుతున్నారట స్టాలిన్. ఇప్పటికే అందుకే సంబంధించి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారట. స్వయంగా ఈ విషయాన్ని అళగిరి ప్రకటించారట. దీంతో రాజకీయంగా తమిళనాడులో పెద్ద చర్చే జరుగుతోంది. అన్న ఎత్తులను చిత్తు చేయడానికి కూడా స్టాలిన్ ప్రయత్నం చేస్తున్నారట. మరి చూడాలి..తమిళనాడు రాజకీయాల్లో అన్నదమ్ముల వైరం ఏ స్థాయికి వెళుతుందో..?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుపరిపాలన అందిస్తున్నాం కదా.. ఓర్వలేకే ఈ దాడులు : సీఎం జగన్