Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రేయా ఘోషల్‌కి చేదు అనుభవం... విలువైన వాయిద్య పరికరాలుంటే?

Webdunia
గురువారం, 16 మే 2019 (17:37 IST)
ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రేయా ఘోషల్‌కు చేదు అనుభవం ఎదురైంది. సింగపూర్ బయలుదేరిన శ్రేయ తనతో పాటు ఓ వాయిద్య పరికరాన్ని కూడా తీసుకువచ్చారు.


అయితే ఇందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఒప్పుకోలేదు. వాయిద్య పరికరాన్ని విమానంలోకి తీసుకురాకూడదని చెప్పారు. దాంతో తప్పని పరిస్థితుల్లో శ్రేయ తన పరికరాన్ని విమానాశ్రయంలోనే విడిచిపెట్టి వెళ్లిపోయింది.
 
ఈ విషయమై సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ పట్ల శ్రేయ తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేసింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ మ్యూజీషియన్స్ వద్ద విలువైన వాయిద్య పరికరాలుంటే విమానంలోకి ఎక్కనివ్వదేమో..! మంచిది. ధన్యవాదాలు, తనకు గుణపాఠం చెప్పారు అంటూ పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన ఎయిర్‌లైన్స్ సంస్థ శ్రేయకు క్షమాపణలు చెప్పింది. 
 
శ్రేయా..మీ పట్ల ఇలా జరిగినందుకు చింతిస్తున్నాం. అసలు ఏమి జరిగింది మరియు మా సిబ్బంది మీతో ఏమన్నారో కాస్త వివరంగా చెప్పగలరా అని కోరారు. ఈ ఘటనపై శ్రేయకు అభిమానుల నుండి మద్దతు లభించింది. విషయం ఎంతో సీరియస్ అయితే గానీ ఆమె ఇలా ట్వీట్ చేయరంటూ అభిమానులు ఎయిర్‌లైన్స్‌పై కామెంట్‌లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

IMD: మే 23-27 వరకు ఐదు రోజుల పాటు వర్షాలు- 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

అత్యాచారం కేసులో జైలు నుంచి విడుదలై సంబరాలు చేసుకున్న నిందితులు!!

Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments