Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై నేపథ్య గాయని హరిణి తండ్రి మృతదేహం

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (13:29 IST)
ప్రముఖ సినీ నేపథ్యగాయని హరిణి తండ్రి ఏకే రావు బెంగుళూరు రైలు పట్టాలపై శవమై కనిపించారు. ఆయన మృతదేహాన్ని బెంగుళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ నేపథ్యగాయని హరిణికి ఇతర భాషల కంటే కన్నడలో మచి పేరుంది. అయితే, వారం రోజుల క్రితం ఈమె కుటుంబం అదృశ్యమైంది. ఈ మేరకు బెంగుళూరు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పోలీస్ కేసు నమోదైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తూ వస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో హరిణి తండ్రి మృతదేహాన్ని రైలు పట్టాలపై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈయన ప్రమాదవశాత్తు పడి చనిపోయారా లేక ఎవరైనా హత్య చేసి చంపేశారా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
కాగా, ఏకే రావు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి పదవీ విరమణ పొందిన ఆయన... సుజనా ఫౌండేషన్‌కు సీఈవోగా పని చేస్తున్నారు. ఈ కార్యాలయానికి వారం రోజుల నుంచి హాజరుకాలేదని కార్యాలయ సిబ్బంది సమాచారం చేరవేశారు. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని బెంగుళూరు రైలు పట్టాలపై గుర్తించడం ఇపుడు కలకలం రేపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments