Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్ పెద్దమనస్సు : శివశంకర్ మాస్టర్‌కు చేతనైన సాయం చేస్తా

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (13:14 IST)
బాలీవుడ్ నటుడు సోనుసూద్ మరోమారు పెద్ద మనసు చాటారు. కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న కొరియో గ్రాఫర్ శివశంకర్ మాస్టర్‌ వైద్య ఖర్చుల కోసం చేతనైన సాయం చేస్తానని ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన గురువారం ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే శివశంకర్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నట్టు తెలిపారు. 
 
కాగా, ఇటీవల కరోనా వైరస్ బారినపడిన శివశంకర్ మాస్టర్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తులు 75 శాతం మేరకు ఇన్ఫెక్షన్ అయ్యాయి. దీంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అలాగే, ఆయన పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్, భార్య సుగన్య కూడా కోవిడ్ బారినపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో శివశంకర్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని చూసిన సోనూసూద్ స్పందించారు. శివశంకర్ రెండో కుమారుడు అజయ్ శివశంకర్‌ను ఫోనులో సంప్రదించి మాస్టర్ ఆరోగ్య పరిస్థిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని సోనూసూద్ వెల్లడించారు. 
 
తాను శివశంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాననీ, ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేతనైన సాయం చేస్తానని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే, పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments