Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సుచిత్ర ఈజ్ వెరీ స్ట్రాంగ్..' సుచీ లీక్స్‌లో ఏదో మతలబు ఉంది : గీతా మాధురి

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన సుచీ లీక్స్‌పై గాయని గీతా మాధురి స్పందించారు. ‘సుచిత్ర ఈజ్ వెరీ స్ట్రాంగ్.. డిప్రెషన్‌కు లోనయ్యే మనస్తత్వం కాదు. ఆమె సింగర్ మాత్రమే కాదు రేడియో జాకీ, రైటింగ్

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (11:20 IST)
దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన సుచీ లీక్స్‌పై గాయని గీతా మాధురి స్పందించారు. ‘సుచిత్ర ఈజ్ వెరీ స్ట్రాంగ్.. డిప్రెషన్‌కు లోనయ్యే మనస్తత్వం కాదు. ఆమె సింగర్ మాత్రమే కాదు రేడియో జాకీ, రైటింగ్ స్కిల్స్ .. ఇలా చాలా లక్షణాలు ఆమెలో ఉన్నాయి. కనుక చాలా అవకాశాలు లభిస్తుంటాయి. చాలా బిజీగా ఉంటుంది. డిప్రెషన్‌కు గురయ్యే స్టేజ్‌లో ఆమె ఉందని నేను అనుకోవట్లేదు. అయితే, సుచీ లీక్స్ వెనుక అసలు ఏం జరిగిందో బహిర్గతం కావాల్సి ఉంది. బహుశా... ఆమె ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని అనుకుంటున్నా’ అని ఆమె చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే... 2012 సంవత్సరానికిగాను ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డు అందుకోనుండటం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. మొదటి నుంచి తన కెరీర్ కోసం తనతో పాటు తల్లి కూడా వస్తుండేవారని, ఆమెతో చనువు ఎక్కువేనని చెప్పారు. తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఏ విషయమూ తన తల్లికి తెలియకుండా ఉంచలేదని, ప్రతి విషయాన్ని ఆమెతో షేర్ చేసుకుంటానని.. తనకు ఎవరైనా ప్రపోజ్ చేసిన విషయాన్ని కూడా చెప్పేసేదానినని గీతా మాధురి నవ్వుతూ మనసులోని మాటను వెల్లడించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments