Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాట‌మ‌రాయుడు' చిత్రంలో 'జివ్వు జివ్వు..' సాంగ్ రిలీజ్ చేసిన అనూప్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా నార్త‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ఫై కిషోర్ పార్థ‌సాని ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కాట‌మ‌రాయుడు`. అనూప్ సంగీత ద‌ర్శ‌క‌త్వం

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (10:32 IST)
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా నార్త‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ఫై కిషోర్ పార్థ‌సాని ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కాట‌మ‌రాయుడు`. అనూప్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా మూడో సాంగ్‌ను రేడియో మిర్చి 98.3లో విడుద‌ల చేశారు. `జివ్వు జివ్వు అగునా..` అంటూ ప‌ల్ల‌వితో సాగే ఈ పాట విడుద‌ల కార్య‌క్ర‌మంలో సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్‌, సాంగ్‌కు సాహిత్యాన్ని అందించిన వ‌రికుప్ప‌ల యాద‌గిరి పాల్గొన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ మాట్లాడుతూ... 'కాట‌మ‌రాయుడు'లో మొద‌టి రెండు పాట‌ల‌కు ఆడియెన్స్ నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాకు సంగీతం అందించే అవ‌కాశం క‌లిగించిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి థాంక్స్‌. ప‌వ‌న్‌సార్‌తో ఇది నాకు రెండో సినిమా. `గోపాల గోపాల` సినిమాలో `భాజే భాజే...`సాంగ్ విన‌గానే ప‌వ‌న్‌ నాకు ఫోన్ చేసి అనూప్ మ‌నం మ‌రోసారి క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని అన్నారు. 
 
అప్పుడు ఫోన్‌లో ఇచ్చిన మాట‌ను `కాట‌మ‌రాయుడు` సినిమాతో పూర్తి చేశారు. ఈ విష‌యం ద్వారా ఆయ‌న మాట ఇస్తే పూర్తి చేస్తార‌ని నాకు ప‌ర్స‌న‌ల్‌గా తెలిసింది. ఆయ‌న అందించిన స‌పోర్ట్‌కు థాంక్స్‌. ఈ జివ్వు జివ్వు అనే సాంగ్‌ను ప‌వ‌ర్‌స్టార్‌గారి ఫ్యాన్స్ కోసం చేశాం. అందరికీ ఈ సాంగ్ కూడా న‌చ్చేలా ఉంటుంది`` అన్నారు. 
 
పాట‌ల ర‌చ‌యిత వ‌రికుప్ప‌ల యాద‌గిరి మాట్లాడుతూ... 'నేను కూడా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి పెద్ద అభిమానిని. ఈరోజు ఆయ‌న న‌టించిన `కాట‌మ‌రాయుడు` సినిమాలో పాట రాయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. `జివ్వు జివ్వు ..` అనే ఈ సాంగ్ అభిమానుల‌కు, ప్రేక్ష‌కులకు న‌చ్చే మాస్ - ఫోక్ సాంగ్‌. ఈ అవ‌కాశం ఇచ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి, శ‌ర‌త్‌మ‌రార్‌కి, డైరెక్ట‌ర్ డాలీకి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్‌గారికి థాంక్స్‌' అన్నారు. 

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments