Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా టూర్‌కు వైరముత్తు కంపెనీగా రమ్మన్నారు : గాయని భువన

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:10 IST)
మీటూ ఉద్యమ ఫలితామని తమిళ సినీ కవి వైరముత్తు బండారం బయటపడుతోంది. నిన్నటికి నిన్న వైరముత్తుపై గాయని చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలు చేసింది. ఇవి కోలీవుడ్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో గాయని భువన శేషన్.. వైరముత్తుపై ఆరోపణలు చేశారు.
 
మలేషియా టూర్‌కు తనకు కంపెనీ ఇవ్వాలని వైరముత్తు అడిగారని, లేదంటే తన కెరీర్‌ని నాశనం చేస్తానని బెదిరించారని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. వైరముత్తుకు వ్యతిరేకంగా గాయని చిన్మయి మొదలుపెట్టిన ఈ ఉద్యమం ద్వారా ఇప్పటికే పదిమందికిపైగా మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టిన విషయం తెల్సిందే. 
 
దీంతో వైరముత్తుకు మద్దతు ఇస్తూ వచ్చిన వారంతా ఇపుడు వివాదానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో వైరముత్తుపై ప్రతి రోజూ వచ్చే ఆరోపణలు పెరుగుతుండటంతో తమిళ సినీ పరిశ్రమ దిగ్ర్భాంతికి గురవుతోంది. దీనిపై ఎలా స్పందించాలో తెలియక మిన్నకుండిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం