Webdunia - Bharat's app for daily news and videos

Install App

చ‌ర‌ణ్ - బోయ‌పాటి మూవీ సంక్రాంతికి వ‌స్తుందా..?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:08 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్  జ‌రుపుకుంటుంది. ఇందులో చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వానీ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం వైజాగ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే... ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అందుచేత ఈ మూవీ సంక్రాంతికి రావ‌డం క‌ష్ట‌మే అనే టాక్ వినిపిస్తోంది. 2 పాట‌లు, 10 రోజుల టాకీ మిన‌హా ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది.
 
ఆ రెండు పాట‌ల్నీ రికార్డ్ చేసేశారు. తెర‌కెక్కించ‌డమే త‌రువాయి. న‌వంబరు చివ‌రిక‌ల్లా షూటింగ్ పార్ట్ పూర్తి చేయాల‌ని భావిస్తోంది చిత్ర‌ బృందం. డిసెంబ‌రులో ప్ర‌మోష‌న్లు మొద‌లెట్టి, సంక్రాంతికి విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్. ఎలా వ‌చ్చిందో కానీ.. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాదు అని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో రంగంలోకి దిగి ఆ వార్త‌ల‌కు ఫుల్‌స్టాఫ్ పెట్టాల‌నుకుంటుంద‌ట చిత్ర‌యూనిట్. ఎట్టి ప‌రిస్థితుల్లోను ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేసి తీర‌తాం అని అంటున్నారు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి. అదీ..సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Marri Rajasekhar: వైకాపాకు మరో ఎదురుదెబ్బ- ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా (video)

Vishnupriya: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు యాంకర్ విష్ణుప్రియ

Rain: వేసవి కాలంలో వర్షాలు పడే అవకాశాలు.. మార్చి 22, 23 తేదీల్లో భారీ వర్షాలు

భర్తను 15 ముక్కలు చేసి.. ప్రియుడితో కలిసి విహార యాత్ర

Viral Mass Video: జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకున్న నారా లోకేష్.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments