Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధర్వ నుంచి సిమ్రాన్ చౌదరి ఫస్ట్ లుక్

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (17:07 IST)
Simran Chaudhary
కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా 'అధర్వ'.  క్రైమ్ థ్రిల్లర్ మూవీగా భారీ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా  సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.  
 
ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో తాజాగా హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చిత్రంలో నిత్య అనే పాత్రలో సిమ్రాన్ చౌదరి కనిపించనుందని తెలిపిన యూనిట్.. ఈ రోల్ సినిమాలో చాలా కీలకం అని పేర్కొన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మిస్టరీ కేసును ఛేదించడంలో ఆధారాలు వెతుకుతున్నట్లుగా చాలా సీరియస్ లుక్ లో కనిపించింది సిమ్రాన్ చౌదరి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ పోస్టర్ విడుదల చేశారు.
 
రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా విడుదల చేయించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. అలాగే ఈ మూవీ నుంచి హీరోకి సంబంధించిన యాక్షన్ లుక్‌ని రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. కార్తీక్ రాజు పవర్‌ఫుల్ రోల్‌ను పోషించినట్టు ఆ లుక్ హింటిచ్చింది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన సిమ్రాన్ చౌదరీ లుక్ సినిమా పట్ల ఉన్న క్యూరియాసిటీ పెంచేసింది. 
 
ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని ఇప్పటివరకు వదిలిన అప్ డేట్స్ స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. ఆయన మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్ అంటున్నారు మేకర్స్. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. 
 
ఈ సినిమాకు చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments