Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరినీ అలరించేలా తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర - కృష్ణ‌, బ్ర‌హ్మానందం

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (16:19 IST)
Krishna, Vinayaka Rao
తెలుగు సినిమా పుట్టిన ఆరేళ్ల కు తొలి తెలుగు సినిమా పత్రిక తెలుగు టాకీ వచ్చింది. ఇక అప్పటి నుంచి తెలుగులో ఎన్ని పత్రికలు వచ్చాయి, ఏ ఏ జర్నలిస్టు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు..అనే వివరాల గురించి మూడేళ్లు కృషి చేసి  సీనియర్ ఫి ల్మ్ జర్నలిస్ట్ వినాయకరావు అందిస్తున్న పుస్తకం తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర. 
 
Brahmanandam, Vinayaka Rao
ఈ పుస్తకం ఫస్ట్ లుక్ పోస్టర్ ను  సూపర్ స్టార్ కృష్ణ, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం విడి విడి గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో కృష్ణ మాట్లాడుతూ..వినాయకరావు గారు ఇంతవరకూ ఎన్టీఆర్, దాసరి, రామానాయుడు గురించి పుస్తకాలు రాశారు.. నా సినీ జీవిత విశేషాలు, నటించిన చిత్రాల వివరాలతో దేవుడు లాంటి మనిషి పుస్తకం రాశారు. 500 పేజీలతో వెలువడిన ఆ పుస్తకం అందరినీ అలరించింది. ఇప్పుడు సినీ పాత్రికేయుల చరిత్రకు అక్షర రూపం ఇస్తున్నారు. అయన ప్రయత్నం విజయవంతమై, మంచి పేరు తెచ్చి పెట్టాలని ఆశిస్తున్నాను..అన్నారు.
 
స్టార్ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ. 84 ఏళ్ల సుదీర్ఘమైన పాత్రికేయ చరిత్రని అక్షరాల్లో పెట్టాలని అనుకోవడం సాహసమే. కానీ ఎంతో మంది జీవిత చరిత్రలు రాసిన వినాయకరావు గారికి ఇది సాధ్యమే అవుతుంది. ఈ పుస్తకం ఆయనకు మరింత పేరు తెచ్చి పెట్టాలని ఆశిస్తున్నాను..అన్నారు.
 
వినాయకరావు మాట్లాడుతూ. పాత్రికేయుల చరిత్రను పుస్తక రూపంలో తీసుకు రావాలన్నది నా 15 ఏళ్ల కల.ఇప్పటికీ అది కార్య రూపం దాలు స్తోంది. పుస్తకం రెడీ అయింది. వచ్చే నెల లో విడుదల చేస్తాం అని తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments