Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైలెంట్‌గా దూసుకుపోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Webdunia
గురువారం, 20 మే 2021 (15:37 IST)
Vijay Devarakonda,
ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది చిన్న పాత్ర‌లే. లైఫ్ ఈజ్ బ్యూటీఫు్‌లో ఓ చిన్న పాత్ర. అందులో జాతి ర‌త్నాలు ఫేమ్ న‌వీన్ పోలిశెట్టి ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు. ఆ గ్రూపులో ఓ చిన్న పాత్ర విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆయ‌న్ను అప్ప‌డు గుర్తు పెట్టుకోవ‌డం క‌ష్ట‌మే. కానీ అత‌ని క‌ష్టంతోపాటు కాలం క‌లిసి వ‌చ్చింది. `అర్జున్ రెడ్డి`తో కెరీర్ ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. ఆ త‌ర్వాత వేళ్ళ‌మీద లెక్క పెట్టే సినిమాలు చేశాడు. ఇప్ప‌డు విజ‌య్‌దేవ‌రొకొండ బాలీవుడ్ పైనే దృష్టి పెట్టాడు. యాడ్ ఫిలింస్ కూడా చేస్తున్నాడు.
 
పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `లైగ‌ర్‌` సినిమా చేస్తున్నాడు. మొద‌టినుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియాలో ప‌ట్టుంది .ఆయ‌న‌కో టీమ్ కూడా వుంది. విజ‌య్‌లోని హీరోయిజానికి, వ్య‌క్తిగ‌త ప్ర‌వ‌ర్త‌న‌కు యూత్ బాగా క‌నెక్ట్ అయ్యారు. అందుకే రోజు రోజుకూ ఆయ‌న త‌న ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. అదెంత‌వ‌ర‌కు వెళ్ళిందంటే ద‌క్షిణాది స్టార్‌ల కంటే అత్య‌ధిక ఫాలోయింగ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వున్న న‌టుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌. 12 మిలియ‌న్‌లో ఫాలోవ‌ర్స్ వున్నారు. ఈ విష‌యం ప‌ట్ల విజ‌య్ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ఇండ‌స్ట్రీలో ఏదో ఒక స్థాయికి చేరాల‌నుకున్నా. కానీ ఇంత స్థాయి వ‌స్తుంద‌ని ఊహించ‌లేద‌ని తెలియ‌జేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments