Webdunia - Bharat's app for daily news and videos

Install App

#SIIMAAwards2019 ల్లో సత్తా చాటిన విజయ్ దేవరకొండ.. రంగస్థలం

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (13:29 IST)
సైమా అవార్డుల్లో టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ సత్తాచాటాడు. అతి త‌క్కువ స‌మ‌యంలో మంచి పాపుల‌ర్ న‌టుడిగా గుర్తింపుపొందాడు. ఈ యువ హీరో సైమా అవార్డు కార్య‌క్ర‌మంలో రెండు అవార్డులు గెలుచుకున్నాడు.
 
'గీతా గోవిందం' చిత్రానికిగాను క్రిటిక్స్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డుతో పాటు సోష‌ల్ మీడియాలో మోస్ట్ పాపుల‌ర్ సెల‌బ్రిటీ అవార్డు గెలుచుకున్నాడు. సైమాలో రెండు అవార్డులు గెల‌వ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ఆయ‌న అభిమానులు కూడా చాలా ఆనందించారు. విజ‌య్ ప్ర‌స్తుతం క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంతో పాటు హీరో అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.
 
మరోవైపు, సౌత్ ఇండ‌స్ట్రీలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగే అవార్డుల కార్య‌క్ర‌మం సైమా (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) తొలి రోజు హోరెత్తింది. ఆగ‌స్టు 15వ తేదీన తెలుగు, క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి సంబంధించిన అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డ్యాన్స్‌ల‌తో పాటు ప‌లు ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి. 
 
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఉత్త‌మ నటుడి అవార్డును రాంచ‌ర‌ణ్ గెలుచుకోగా, ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్ ఎంపికైంది. టాలీవుడ్‌లో అత్య‌ధిక అవార్డులు అందుకున్న 'రంగ‌స్థ‌లం' స‌త్తా చాటింది. ఇక 16వ తేదీన తమిళ, మలయాళ చిత్రాలకు సంబంధించిన అవార్డుల వేడుక జ‌ర‌ప‌నుండ‌గా ఆ రోజు మాలీవుడ్ మెగాస్టార్ మోహ‌న్ లాల్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌ుకానున్నారు. ఇదిలావుంటే, 2019 సైమా అవార్డు విజేతల వివరాలను ఓసారి పరిశీలిస్తే, 
 
ఉత్తమ చిత్రం : మహానటి
ఉత్తమ దర్శకుడు : సుకుమార్‌ (రంగస్థలం)
ఉత్తమ నటుడు : రాంచరణ్‌ (రంగస్థలం)
ఉత్తమ నటి : కీర్తి సురేష్‌ (మహానటి)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్‌ దేవరకొండ( గీత గోవిందం)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్‌ ( మహానటి)
ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం)
ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో)
ఉత్తమ విలన్‌ : శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నవవే - రంగస్థలం)
ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా - ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ - రంగస్థలం)
ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్‌ (విజేత)
ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్‌ భూపతి (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రం‍గస్థలం)
సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ స్టార్ : విజయ్‌ దేవరకొండ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments