Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

దేవీ
బుధవారం, 18 జూన్ 2025 (17:46 IST)
Sidhu Jonnalagadda
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా 'తెలుసు కదా'తో అలరించబోతున్నారు. ఈ మూవీతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా డెబ్యు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ మూవీ చివరి షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమైంది.
 
ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిలపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనితో సినిమా మొత్తం ప్రొడక్షన్ పూర్తవుతుంది. సైమల్టేనియస్‌గా సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి.
 
ఈ నెలలో ఈ సినిమా మొదటి పాటను విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించాలని టీం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.  
 
తెలుసు కదా మనసు హత్తుకునే కథ. ఇది లవ్, పర్శనల్ గ్రోత్, రిలేషన్షిప్స్ మధ్య సాగుతుంది. అద్భుతమైన ఎమోషన్, హ్యుమర్ తో ప్రేక్షకులని అలరించబోతోంది.
 
ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ స్టైలిష్‌గా కనిపిస్తూ చాలా మెచ్యూర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. 
 
ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ జ్ఞాన శేఖర్ బాబా, నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌, షీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.
 
తెలుసు కదా సినిమా ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 17న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూ కాశ్మీర్‌కు చార్మిత్రాత్మక మైలురాయిగా మొదటి సరుకు రవాణా రైలు

కుల్గాంలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు, 9 మంది గాయపడ్డారు, ముగ్గురు ఉగ్రవాదులు హతం

లక్షద్వీప్ దీవులలోని ఉపాధ్యాయుల కోసం ఏఐ శిక్షణా కార్యక్రమం

Andhra Pradesh: ఇండియా జస్టిస్ రిపోర్ట్- 2025: రెండో స్థానానికి ఎగబాకిన ఆంధ్రప్రదేశ్

నా స్కూటీ నాకిచ్చేయండి... వా... అంటూ పోలీసుల వద్ద ఏడ్చిన యువతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments