Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌ టెంపుల్‌ సెట్‌లో శ్యామ్‌సింగ రాయ్ పూర్తి

Webdunia
సోమవారం, 26 జులై 2021 (17:08 IST)
Nani-temple set
కోవిడ్‌ సెకండ్‌ వేవ్, భారీ ఈదురు గాలులు, వర్షాలు ‘శ్యామ్‌సింగరాయ్‌’ సెట్స్‌ను నాశనం చేయగలిగాయి. కానీ షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ కాకుండా ఆపలేకపోయాయి. అన్ని అడ్డంకులను సమర్ధవంతంగా ఎదుర్కొని న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘శ్యామ్‌సింగ రాయ్‌’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను శరవేగంగా జరుపుతున్నామని చిత్రయూనిట్‌ సగర్వంగా తెలిపింది.
 
పశ్చిమబెంగాల్‌లో నాని శ్యామ్‌సింగరాయ్‌ లాంగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. బెంగాల్‌ సంస్కృతి ప్రతిబింబించేలా అద్భుతంగా వేసిన టెంపుల్‌ సెట్‌లో కొన్ని ప్రధానమైన, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ ఈ చిత్రంలో నటించారు. రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమఠం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు అసోసియేటైయ్యారు.
 
నిహారిక ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా  ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్‌ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.  శాను జాన్‌ వర్గీస్‌ సినిమాటోగ్రాఫర్‌గా, నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్‌ చేస్తున్నారు.
 
వెండితెరపై ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమా ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌లా ఉండేందుకు గ్రాఫిక్స్‌ టీమ్‌ శక్తివంచన లేకుండా హై ఎండ్ టెక్నాల‌జీతో పని చేస్తున్నారు. దీంతో ‘శ్యామ్‌సింగరాయ్‌’ కథ, కథనాల పరంగానే కాదు.. విజువల్‌ పరంగా కూడా అత్యద్భుతంగా ఉండబోతుంది. దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించారు. అనుకున్న సమయంలో షూటింగ్‌ పూర్తిచేయడానికి పూర్తి సహాకారం అందించిన యూనిట్‌ కి నిర్మాత కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments