Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (16:38 IST)
ఒకపుడు కుర్రకారుకు నిద్రలేని రాత్రులను మిగిల్చిన హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ ఒకరు. ఆ మధ్య ఓ కేసులో చిక్కుకుని సినీ  కెరీర్‌‍ను నాశనం చేసుకున్నారు. ఫలితంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఓ సినిమా లొకేషన్‌లో తనకు ఎదురైన పరిస్థితిని ఆమె వివరించారు. 
 
కెరీర్ విషయంలో నేను సంతృప్తికానే ఉన్నాను. నాకు నచ్చిన సినిమాల్లో నటిస్తున్నాను. ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కేరీర్ పరంగా ఇబ్బందిపడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా, ఒక తెలుగు చిత్ర సెట్‌లో చాలా అసౌకర్యానికి గురయ్యాను. 
 
ఆ చిత్ర హీరోతో పోల్చితే నేను ఎత్తు తక్కువ. హీరో 6 అడుగులు వుంటే నేను 5 అడుగులు ఉన్నాను. పైకా, హీరోతో వచ్చన సమస్య మరో స్థాయిలో ఉండేది. అతను ప్రతి సన్నివేశాన్ని మార్చేస్తుండేవాడు. గందరగోళానికి గురిచేసేవాడు. రీటేక్స్ ఎక్కువగా తీసుకునేవాడు. 
 
అన్నిటికంటే ముఖ్యంగా, తెలుగు హీరో అయివుండి తెలుగులో డైలాగ్స్ చెప్పలేకపోయేవాడు. కారణం తెలుగు భాషపై పట్టులేకపోవడమే. నాకు కూడా తెలుగు పెద్దగా రాదు. కానీ నేను మేనేజ్ చేసేదాన్ని. ఏదో రకంగా డైలాగ్స్ నేర్చుకుని వచ్చేదాన్ని. 
 
కానీ, నన్ను మాత్రం నా కంట్రోల్‌లో లేని నా ఎత్తు గురించి కామెంట్ చేసేవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది కదా.. దానికి నేనేం చేయను. నాకు తెలిసి నేను అంత బాధపడిన సెట్ ఏదైనా ఉందంటే అది మాత్రమే అని ఆమె వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments