Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

దేవి
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (16:30 IST)
Sivakarthikeyan Cake cutting
శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'మదరాసి'. శివకార్తికేయన్ 'అమరన్'తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందించారు. కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్న దర్శకుడు మురుగదాస్ ఈ సంవత్సరం రెండు మేజర్ ఫిలిమ్స్ అందించబోతున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా అద్భుత స్థాయిలో రూపొందుతోంది.
 
ఈరోజు, శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా, ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి యాక్షన్-ప్యాక్డ్ గ్లింప్స్ తో ఈ చిత్రం టైటిల్ 'మదరాసి'ని రివిల్ చేశారు మేకర్స్. శివకార్తికేయన్ పూర్తిగా పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. ఈ గ్లింప్స్ సినిమాలోని ఇతర కీలక పాత్రలను కూడ పరిచయం చేస్తుంది.
 
టైటిల్ గ్లింప్స్‌లో సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామోన్  హై-క్లాస్ విజువల్స్ ఆకట్టుకున్నాయి, రాక్‌స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ తన ఎలక్ట్రిఫైయింగ్ స్కోర్‌తో విజువల్స్‌ను ఎలివేట్ చేశాడు.
 
తన ఇంటన్సీవ్ నెరేటివ్ గ్రిప్పింగ్ స్టొరీ టెల్లింగ్ తో ఆకట్టుకునే ఎఆర్ మురుగదాస్ మదరాసితో సరికొత్త ఎక్సయిటింగ్ యాక్షన్-ప్యాక్డ్ కథను చూపించబోతున్నారని గ్లింప్స్ ప్రామిస్ చేస్తోంది.
 
హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు ఇది మొదటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్టర్. యాక్షన్ కొరియోగ్రఫీని కెవిన్ మాస్టర్, దిలీప్ మాస్టర్ పర్యవేక్షిస్తారు.
 
టైటిల్ రివీల్, గ్లింప్స్ ఈ హై-ప్రొఫైల్ ప్రాజెక్ట్ కోసం ఎక్సయిట్మెంట్ పెంచాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: భారతదేశంపై ట్రంప్ అక్కసు, యాపిల్ ప్లాంట్ ఆపేయమంటూ ఒత్తిడి

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments