Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెబ్బకు మాట మార్చేసిన శృతిహాసన్, అసలు ఏమైంది..?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (14:57 IST)
కమల్ హాసన్ కుమార్తెగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ కెరీర్ ప్రారంభంలో అనగనగా ఓ థీరుడు, ఓ మై ఫ్రెండ్ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో శృతి పైన ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. అయినప్పటికీ.. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా శృతిహాసన్ జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో రేసుగుర్రం సినిమాలో నటించింది.
 
ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించడంతో శృతి జీవితమే మారిపోయింది. ఈ అమ్మడుకు వరుసగా అవకాశాలు వచ్చాయి. బిజీ హీరోయిన్ అయ్యింది. అయితే... ఇటీవల బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలు ఇంకా చెప్పాలంటే సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడింది.
 
హిందీ సినిమాలతో పోటీ పడేందుకు తెలుగు సినిమాలు ట్రై చేస్తున్నాయంటూ హిందీ సినిమాలను మెచ్చుకుంటూ.. తెలుగును కాస్త తక్కువ చేసి మాట్లాడటం జరిగింది. ఆమెకు అవకాశాలు ఇచ్చి ఆదరించిన తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల గురించి తక్కువ చేస్తావా అంటూ నెటిజన్లు ఈ అమ్మడును ట్రోల్ చేస్తున్నారు.
 
దీంతో దెబ్బకు దిగి వచ్చిన ఈ అమ్మడు నేను అలా అనలేదు. తెలుగు సినిమాలో గబ్బర్ సింగ్, రేసుగుర్రం ఎప్పటికీ మరచిపోలేను. నా జీవితాన్ని మార్చిన సినిమాలు అవి అంటూ మాట మార్చింది ఈ అమ్మడు. అప్పుడు అలా మాట్లాడటం ఎందుకు..? ఇప్పుడు ఇలా మాట మార్చడం ఎందుకు..? ఇకనైనా తెలుగు సినిమాల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతుందని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూర్యాపేటలో పరువు హత్య.. కులాంతర వివాహం చేసుకున్నాడని కొట్టి చంపారు..

పరాయి మహిళ మోజులోనే గురుమూర్తి ఘాతుకం!

Amazon: అమేజాన్ విధానాలపై పవన్ అసంతృప్తి.. గిఫ్ట్ కార్డుల నుండి డబ్బు.. ఇంత కష్టమా?

'మ్యాన్ ఈటర్ టైగర్' చనిపోయింది.. పులి పొట్టలో మహిళ వెంట్రుకలు... చెవిరింగులు!!

భారత్ - చైనాల మధ్య అంగీకారం.. త్వరలో మానస సరోవర యాత్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments