తమిళ బిగ్ బాస్‌ హోస్ట్‌గా శ్రుతిహాసన్

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (10:55 IST)
తమిళ బిగ్ బాస్ ఐదో సీజన్ హోస్ట్ కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కమల్ హాసన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ బిగ్ బాస్ హోస్ట్‌పై సందిగ్ధత నెలకొంది. తెలుగులో నాగార్జున సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటే సమంత హోస్ట్‌గా వ్యవహరించి విషయం తెలిసిందే. తాజాగా తమిళ బిగ్‌బాస్‌లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఇటీవల అమెరికా టూర్‌ వెళ్లొచ్చిన కమల్‌ హాసన్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 
 
ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో రెండు వారాల పాటు కమల్‌ బిగ్‌బాస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే కమల్‌ స్థానంలో నటీమణి, కమల్‌ కూతురు శృతీ హాసన్‌ను తీసుకొచ్చేందుకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. శృతీ హాసన్‌ అయితే బాగుంటుందని భావిస్తోన్న షో నిర్వాహకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని టాక్‌. మరి కమల్‌ స్థానాన్ని ఎవరు రీప్లేస్‌ చేస్తారో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం : మంత్రి నారా లోకేశ్

ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న సైనికాధికారులకు 'వీర చక్ర'

బొద్దింకను చంపేందుకు నిప్పు పెడితే.. అపార్టుమెంట్ తగలబడింది...

కన్నడిగను అని చెప్పడానికి గర్వంగా ఉంది... ఎవరికీ సమాధానం చెప్పను.. కిరణ్ మజుందార్

జీవికా దీదీలకు నెలకు రూ.30 వేలు ఆర్థిక సాయం : ఆర్జేడీ బిగ్ ప్రామిస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments