Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైంటిఫిక్, హిస్టారిక్ అంశాలతో - మిస్సమ్మ చిత్రం

Advertiesment
సైంటిఫిక్, హిస్టారిక్ అంశాలతో - మిస్సమ్మ చిత్రం
, శనివారం, 20 నవంబరు 2021 (17:41 IST)
Abhiraj Rupala, Lahari, Shobhita Rana, Talasani
అలనాటి మిస్సమ్మ ఆల్ టైం క్లాసిక్‌గా చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి క్యారెక్టరైజేషన్ తీసుకుని సరికొత్త కథ, కథనాలతో చేస్తున్న ప్రయత్నంగా మిస్సమ్మ చిత్రం ప్రారంభ‌మైంది. శ్రీ వేంకటేశ్వర సాయి క్రియేషన్స్ హరి ఐనీడి, రమ్య కొమ్మాలపాటి నిర్మాతలుగా నిర్మిస్తున్నారు.  అభిరాజ్ రుపాల, సతీష్ V. M  ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.
 
అర్జున్ కృష్ణ బొల్లిపల్లి, బిగ్ బాస్ లహరి, శోభిత రానా ల‌పై ముహూర్త‌పు స‌న్నివేశాన్ని శ‌నివారంనాడు చిత్రించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి వద్ద హీరో హీరోయిన్ల ఫై క్లాప్ కొట్టి ప్రారంభించారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న మిస్సమ్మ హిట్ కావాలని ఆయన కోరుకున్నారు. 
 
ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ ఆరా మస్తాన్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా సోలో బ్రతుకే సో బెటర్ దర్శకుడు సుబ్బు ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ చేశారు.
 
webdunia
Missamma Opening
ఈ చిత్రం సైంటిఫిక్, హిస్టారిక్ అంశాలతో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కబోతోంది. హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో పాటు ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ అండ్ యూనిక్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మిస్సమ్మ . బ్రిటీషర్స్ రాక ముందు ఇండియన్ హిస్టరీ నుంచీ, బ్రిటిషర్స్ రిజైమ్ నుంచీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తీసుకుని, ఆ విషయాలను ఆసక్తికరంగా, ఎంటర్టైనింగ్‌గా, థ్రిల్లింగ్‌గా చెప్పే ప్రయత్నం ఈ మిస్సమ్మ అని దర్శకులు తెలిపారు.
 
హీరోయిన్ శోభిత రానా మారట్లాడుతూ, ఈ సినిమాలో నా పాత్ర చాలా కీలకమైనది అన్నారు. 
 
 బిగ్ బాస్ లహరి మాట్లాడుతూ .. మిస్సమ్మ సినిమాలో నేను కూడా చెయ్యటం చాలా ఆనందం గా వుంది అన్నారు.
 
హీరో అర్జున్ కృష్ణ మాట్లాడుతూ .. నాకు నటుడిగా మంచి గుర్తింపు ఇచ్చే సినిమా మిస్సమ్మ అవుతుంది. ఈ సినిమా తరువాత హీరోగా మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నేను రుణపడి వుంటాను అని అన్నారు.
 
ఇంకా ఈ సినిమాలో శివ కాటంనేని, D Sరావు , D M జాన్సన్ విలన్ గా, అమృతం అప్పాజీ మరియు బిగ్ బాస్ లహరి, పింగ్ పాంగ్ సూర్య  ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు: కథ : V.M సతీష్, కథనం, మాటలు - హను రావూరి. ఛాయ గ్రహణం- డేవిడ్ మార్గెల్, కో- డైరెక్టర్ -రవి కిశోర్ చందిన, ఆర్ట్ డైరెక్టర్- S V మురళి, PRO - సాయి సతీష్, పర్వతనేని రాంబాబు, కాస్ట్యూమ్స్ - అశ్వంత్ బైరి, మేనేజర్- రాజేష్ రడం, తదితరులు పనిచేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటి షాలూ చౌరాసియాపై దాడి చేసినవాడు సినిమావాడే... పట్టేసారు