Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ కెమెరా ముందుకు శృతిహాసన్

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:48 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతిహాసన్. న‌టిగా, సింగ‌ర్‌గా, ఆర్టిస్ట్‌గా ఇలా ఎన్నో విభాగాల‌లో త‌న ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తూ, సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. పైగా, తండ్రికి తగ్గ తనయగా పేరుగడించింది. అటు తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగింది. 
 
ఈ అమ్మడు నటించిన చిత్రాలు విడుదలై చాలా రోజులైంది. దీంతో అభిమానులు ఆమె సినిమాల కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఆ మ‌ధ్య "శ‌భాష్ నాయుడు" అనే చిత్రంలో క‌మల్‌తో క‌లిసి శృతి న‌టించింది. కాని ఈ సినిమా ఇప్ప‌ట్లో విడుద‌ల‌య్యేలా క‌నిపించ‌డం లేదు. 
 
అయితే తాజాగా "సూప‌ర్ డీల‌క్స్" అనే చిత్రంతో మంచి హిట్ కొట్టిన విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న శృతిహాసన్ నటించనుంది. ఎస్‌పీ జ‌న‌నాథ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. "లాభం" అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్‌పైకి వెళ్ళ‌నుంది. దేశంలో రైతులు ప‌డుతున్న క‌ష్టాల ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments