లాక్డౌన్‌లో లాక్... 24 గంటలూ అతనితోనే గడుపుతున్నా : శృతిహాసన్

Webdunia
గురువారం, 13 మే 2021 (19:40 IST)
తమిళ పిల్ల శృతిహాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ - సారిక ముద్దుల కుమార్తెల్లో ఒకరు. ఈమె ఏ పనిచేసినా అందులో దాపరికం ఇసుమాత్రం కూడా ఉండదు. పైగా, అంతా ఓపెన్ టైప్. అలాగే తన వ్యక్తిగత విషయాలను కూడా బాహాటంగానే తెలియజేస్తుంటారు. 
 
తాజాగా తన లవర్‌ మైఖేల్‌ కోర్సల్‌తో బ్రేకప్‌ అయిన తక్కువ సమయంలోనే మరో వ్యక్తికి కనెక్ట్‌ అయింది. డూడుల్‌ ఆర్టిస్ట్‌గా పేరున్న శాంతను హజారికాతో శ్రుతీ సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది. పైగా, తన కొత్త ప్రియుడిని కూడా తన తల్లిదండ్రులకు పరిచయం కూడా చేసింది. 
 
ఇపుడు అతనితో క్లోజ్‌గా ఉంటున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి షాకిచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలూ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలు మరింత బలపడేలా తన కొత్త స్నేహితుడికి సంబంధించి మరిన్ని విషయాలు ఈ చెన్నై బ్యూటీ వెల్లడించింది. 
 
ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా లాక్డౌన్‌ టైమ్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో లాక్‌ అయ్యానంటూ కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది. అంతే కాదు ఇనస్టాగ్రామ్‌ లైవ్‌ కూడా ఇచ్చింది. ఇద్దరూ ఎప్పుడు కలుసుకున్నారనే ప్రశ్నకు మాత్రం శృతిహాసన్‌ సమాధానం ఇవ్వకుండా దాటేసింది. అది మాత్రం ఎప్పటికీ సీక్రెట్‌ అని చెబుతోంది.
 
ఇద్దరూ కలిసి ఎంత సేపు గడుపుతారనే మరో నెటిజన్‌ ప్రశ్నకు రోజంతా గడుపుతామని సమాధానమిచ్చింది. ‘‘ప్రస్తుతం 24 గంటలు శాంతనుతోనే గడుపుతున్నాను. ఈ సమయంలో నేనే వంట చేస్తున్నా. శాంతను ఆలూ కర్రీ మాత్రం చేస్తాడు. తను పాలు, పంచదార లేకుండా అస్సాం టీ తాగుతాడు. నాకు మాత్రం టీలో అన్నీ ఎక్కువ ఉండాలి’’ అని శ్రుతీహాసన్‌ చెప్పుకొచ్చింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

పరకామణి చోరీ కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర : భూమన

ఏపీలో కొత్తగా మరో రెండు జిల్లాలు.. రంపచోడవరం కూడా పరిశీలన

Gram Panchayats Polls: తెలంగాణలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments