Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడేమో ధనుష్‌తో జోడీగా.. ఇప్పుడేమో శింబుకు తల్లిగా శ్రియ ఎలా..? త్రిష వద్దన్నాకే..!?

కోలీవుడ్ బక్క హీరో ధనుష్‌తో హీరోయిన్‌గా నటించిన శ్రియ, ధనుష్ వయస్సున్న యంగ్ హీరో శిళంబరసన్‌కు తల్లి పాత్రలో శ్రియ నటించనుందనే వార్తే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 35 ఏళ్ల వయస్సులో 16 ఏళ్ల పాటు సినిమా ఇండ

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (13:53 IST)
కోలీవుడ్ బక్క హీరో ధనుష్‌తో హీరోయిన్‌గా నటించిన శ్రియ, ధనుష్ వయస్సున్న యంగ్ హీరో శిళంబరసన్‌కు తల్లి పాత్రలో శ్రియ నటించనుందనే వార్తే ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

35 ఏళ్ల వయస్సులో 16 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న శ్రియ.. ఏజ్ అయినా తన సొగసులో ఎలాంటి తరుగు లేకుండా చూసుకుంటోంది. ఇంకా వచ్చిన అవకాశాలను అలాగే చేసుకుంటూ పోతోంది. 
 
ఇందులో భాగంగానే నటనకు ప్రాధాన్యం గల పాత్రలో.. అదీ శింబుకు తల్లిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అడపా దడపా సినిమాల్లో కనిపించిన శ్రియ.. సంవత్సరానికి 2.5 కోట్ల రూపాయల్ని సంపాదిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్. 5కె-10కె రన్‌‌లకు.. ఇంకా ఏ సినిమా ఈవెంట్‌ అయినా, అవార్డు ఫంక్షన్‌ అయినా శ్రియ డ్యాన్స్‌ తప్పనిసరిగా ఉంటుంది.
 
ఇంకా రిబ్బన్ కట్టింగులతో పాటు ఉత్తరాదిన జరిగే ర్యాంప్‌వాక్‌ల్లో శ్రియ తప్పనిసరిగా పాల్గొంటోంది. తద్వారా శ్రియ వయసైనప్పటికీ బాగానే సంపాదిస్తుందని సినీ జనం అంటున్నారు. మరి డబ్బు కోసమే శింబుకు తల్లిగా శ్రియ కనిపించనుందని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ పాత్రకు ఇప్పటికే త్రిషను సంప్రదిస్తే ఆమె ఒప్పుకోలేదట. దీంతో శ్రియను కలిసిన శింబు సినిమా యూనిట్‌కు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments