Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రియ రేటు రూ.5 లక్షలు... నమ్మించిన విలేఖరి... సహకరించిన హీరోయిన్ మేనేజర్

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (11:48 IST)
ప్రముఖ టీవీ చానెల్ ఓ రియాల్టీ షోను నిర్వహిస్తోంది. ఈ షోకు న్యాయ నిర్ణేతగా హీరోయిన్ శ్రియను తీసుకొస్తానని ఓ విలేఖరి నమ్మించాడు. ఇందుకోసం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఈ విషయాన్ని శ్రియ మేనేజర్‌కు చెప్పాడు. ఆయన కూడా సరేనంటూ సమ్మతించాడు. చివరకు శ్రియ రాకపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 5లో నివాసం ఉండే చంద్రాయుడు, ఓ చానల్‌లో రియాల్టీ షోను నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నాడు. దీనికి న్యాయ నిర్ణేతగా శ్రియను పిలిపించాలని భావించాడు. ఈ క్రమంలో చంద్రాయుడికి పరిచయమైన ఓ న్యూస్ పేపర్ విలేకరి, శ్రియకు మేనేజర్‌గా పనిచేసే లక్ష్మీ సింధూజ తనకు పరిచయమని చెప్పాడు. 
 
ఆపై ఆమెను పిలిపించి, ఓ హోటల్‌లో చర్చలు సాగించారు. శ్రియను ఒప్పిస్తానని సింధూజ చెప్పడంతో ఆమె ఖాతాలో రూ.5 లక్షలు జమ చేశాడు. ఆపై నెల రోజులు గడిచినా, శ్రియ రాకపోవడం, సింధూజ, సదరు రిపోర్టర్ అందుబాటులో లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారు ఎక్కడున్నారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments