Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

డీవీ
శనివారం, 5 అక్టోబరు 2024 (18:37 IST)
Shraddhadas - Trikala
శ్ర‌ద్ధాదాస్ , అజ‌య్‌, మాస్టర్ మహేంద్ర‌న్‌ ప్రధాన పాత్రధారులుగా రిత్విక్ సిద్ధార్థ్ స‌మ‌ర్ప‌ణ‌లో మిన‌ర్వా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ చిత్రం ‘త్రికాల’. ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ ట్యాగ్ లైన్. మ‌ణి తెల్ల‌గూటి ద‌ర్శ‌క‌త్వంలో రాధికా శ్రీనివాస్ నిర్మాత గా, శ్రీసాయి దీప్ చాట్ల‌, వెంక‌ట్ ర‌మేష్ దాడి, ఓంకార్ ప‌వ‌న్‌ లు సహా నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. విజువ‌ల్ గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్య‌మున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
 
భారీ బ‌డ్జెట్‌తో ఫాంటసీ, హార‌ర్ జోన‌ర్ మూవీగా  కుమారి ఖండం నేప‌థ్యాన్ని ఆధారంగా చేసుకుని, నేటి కాలానికి త‌గ్గ‌ట్టుగా మార్పులు చేర్పులు చేసి సినిమాను తెర‌కెక్కించారు. కుమారి ఖండాన్ని ప‌రిచ‌యం చేస్తూనే మూల క‌థ‌కు పురాణ నేపథ్యంతో పాటు నూతన హంగుల‌ను అద్దుతూ టీమ్ సినిమాను ఆవిష్క‌రించింది. దేవి చిత్రంలో బాల న‌టుడిగా మెప్పించిన మాస్ట‌ర్ మ‌హేంద్ర‌న్ ఈ చిత్రంతో ప్రధాన పాత్ర దారుడుగా మీ ముందుకు వస్తున్నారు. స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ఈ సినిమాను ద‌ర్శ‌కుడు మ‌ణి తెల్ల‌గూటి అండ్ టీమ్ రూపొందిస్తున్నారు. త్వరలోనే మరికొన్ని విశేషాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments