Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌‌కు నోటీసులు

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (15:53 IST)
బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల అంశం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఈ వారం విచారణకు హాజరు కావాల్సిందిగా యువ నటీమణులు శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లకు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సుశాంత్‌సింగ్‌ కేసు విచారణలో భాగంగా బయటపడ్డ మాదక ద్రవ్యాల సరఫరా అంశంలో దర్యాప్తు సంస్థ ఇప్పటికే సుశాంత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తితోపాటు పలువురిని అరెస్టు చేసింది. 
 
అంతకుముందు మూడు రోజులపాటు రియాను విచారించగా ఆమె పలువురు బాలీవుడ్ స్టార్ల పేర్లు బయటపెట్టింది. అందులో శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఎన్‌సీబీ వారికి త్వరలోనే సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ (34) జూన్‌ 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
రియా చక్రవర్తి తన కుమారుడిని మానసికంగా వేధించిందని, బ్యాంకు ఖాతా నుంచి కోట్లలో డబ్బు బదిలీ చేసుకుందని నటుడి కుటుంబం కేసు వేసింది. అనంతరం రంగంలోకి దిగిన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఎన్‌సీబీ దర్యాప్తును ముమ్మరం చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments