Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీసీపీ గంగిరెడ్డితో హారికకు లింకు... లవ్ మ్యాటర్ కూడా : దర్శకుడు యోగి

మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డితో నటి హారికకు పరిచయం ఉందని, పలు సందర్భాల్లో ఆయనను ఆమె ఆశ్రయించిందనీ లఘు చిత్ర దర్శకుడు యోగి చెప్పుకొచ్చాడు.

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (15:25 IST)
మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డితో నటి హారికకు పరిచయం ఉందని, పలు సందర్భాల్లో ఆయనను ఆమె ఆశ్రయించిందనీ లఘు చిత్ర దర్శకుడు యోగి చెప్పుకొచ్చాడు. పైగా, ఓ నిర్మాత కుమారుడితో హారిక ప్రేమ వ్యవహారం సాగిస్తోందని, ఈ విషయం తన వల్లే బయటకు పొక్కిందని భావించి తనను పోలీసు స్టేషన్‌ గడప తొక్కేలా చేసిందని యోగి వాపోయాడు. 
 
తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి హారిక ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుతో దర్శకుడు యోగిని పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నారు. అదేసమయంలో డీసీపీ గంగిరెడ్డి నిగ్రహం కోల్పోయి యోగిని బూటు కాలితో తన్నుతూ, చెంపలు పగులగొడుతూ హింసలకు గురిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకురావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. పైగా, ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసు నగర కమిషనర్ విచారణకు ఆదేశించారు. 
 
ఇదిలావుంటే, తనకు, నటి హారికకు మధ్య జరిగిన విషయాలను దర్శకుడు యోగి వివరించాడు. నటి హారిక, తాను మంచి స్నేహితులమని... ఒక చిన్న గొడవ కారణంగా తమ మధ్య మనస్పర్థలు వచ్చాయన్నాడు. ఆమె వద్ద తాను రూ.10 వేలు తీసుకున్నానని... ఈ డబ్బు గురించే తనను పోలీసుల వద్దకు పిలిపించిందన్నాడు. విచారణ సందర్భంగా అడిషనల్ డీసీపీ గంగిరెడ్డితో తాను మాట్లాడుతూ 'సార్, కేవలం పది వేల కోసం పిలిపిస్తారా? ఇది అన్యాయం సార్' అని అన్నానని... దీంతో, ఆయన రెచ్చిపోయి తనపై చేయిచేసుకున్నారని... నాతోనే మాట్లాడతావా? అంటూ బూతులు తిడుతూ బూటు కాలితో తన్నారనీ యోగి తెలిపాడు.
 
రూ.పది వేల గురించి పిలవడం దారుణం అని అన్నందుకే... అప్పటికప్పుడు హారిక చేత తనపై అడిషనల్ డీసీపీ ఫిర్యాదు రాయించారని యోగి ఆరోపించాడు. పైగా, హారికకు ఓ నిర్మాత కుమారుడితో లవ్ మ్యాటర్ ఉందని... ఈ విషయం పలువురికి తెలుసన్నాడు. కానీ, ఈ విషయం తనవల్లే బయటకు పొక్కిందనీ హారిక భావించి తన వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేసిందన్నాడు. దీంతో తమ ఇద్దరి మధ్య కొంతమేర వాదోపవాదాలు జరిగాయని తెలిపాడు. 
 
ఇకపోతే, స్టేషన్‌లో విచారణ సందర్భంగా తన ఫోన్‌లో అమ్మాయిల న్యూడ్ ఫొటోలు ఉన్నాయంటూ డీసీపీ గంగిరెడ్డి మొబైల్‌ను లాక్కున్నారని... మొత్తం చెక్ చేసినా అభ్యంతరకరమైనదేదీ దొరకలేదని యోగి చెప్పాడు. ఒక దర్శకుడిగా పలువురి నటీనటుల ప్రొఫైల్స్ తన వద్ద ఉంచుకోవడం సహజమేనన్నాడు. దాదాపు 600 మంది ఫొటోలు తన వద్ద ఉంటాయని... అయితే, తనను అమ్మాయిలను సప్లై చేసే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు. జరిగిన వాస్తవాలను తాను చెబుతున్నప్పటికీ అడిషనల్ డీసీపీ పట్టించుకోలేదన్నాడు. తాను తప్పు చేసినట్టు తేలితే, ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమేనని చెప్పాడు.
 
పైగా, డీసీపీ గంగిరెడ్డితో హారికకు ఇంతకుముందు నుంచే పరిచయం ఉందని... ఆమెకు ఏ సమస్య వచ్చినా ఆయనకు చెప్పేదని... ఈ నేపథ్యంలోనే, రూ.10 వేల కోసం మళ్లీ ఆయనను కలిసిందన్నాడు. తనకు పనిష్‌మెంట్ ఎందుకిచ్చారో అర్థంకావడం లేదని అన్నాడు. ఎంక్వైరీ సరిగా చేయలేదని... తాను చెప్పే విషయాలను పట్టించుకోలేదని లఘు చిత్ర దర్శకుడు యోగి వాపోయాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తీయని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అమ్మాయిలను ఎరవేసి అబ్బాయిలకు గాలం.. రూ.వేలల్లో బిల్లులు వసూలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం