Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లఘు చిత్ర దర్శకుడు యోగి ఆ హీరో భార్యను కూడా వదల్లేదు...

హీరోయిన్ హారికను లైంగికంగా వేధించిన వ్యవహారంలో లఘు చిత్ర దర్శకుడు యోగిని హైదరాబాద్ మాదాపూర్ పోలీసులకు స్టేషన్‌కు పిలిచి తమదైనశైలిలో విచారణ జరుపుతున్నారు.

లఘు చిత్ర దర్శకుడు యోగి ఆ హీరో భార్యను కూడా వదల్లేదు...
, శనివారం, 23 డిశెంబరు 2017 (15:00 IST)
హీరోయిన్ హారికను లైంగికంగా వేధించిన వ్యవహారంలో లఘు చిత్ర దర్శకుడు యోగిని హైదరాబాద్ మాదాపూర్ పోలీసులకు స్టేషన్‌కు పిలిచి తమదైనశైలిలో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈయన సాగించిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేవలం ఒక్క నటి హారికను మాత్రమే కాకుండా, ఓ హీరోతో పాటు.. పలువురు నటుల భార్యలను కూడా ఈ షార్ట్ ఫిల్మ్ దర్శకుడు వదిలిపెట్టలేదట. 
 
ఈ కోవలో ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన జేడీ చక్రవర్తి భార్య అనుక్రితిని కూడా యోగి వేధించాడట. తనను అభ్యంతరకరంగా నటించమని ఒత్తిడి చేశాడని 2016 జూలైలో జూబ్లీహిల్స్ పోలీసులకు అనుకీర్తి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత హీరో జేడీ చక్రవర్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి వెళ్లిపోయింది. కానీ, అనుకీర్తి ఫిర్యాదు చేసిన వ్యవహారం ఇపుడు వెలుగులోకి వచ్చింది. 
 
"తన వద్ద డబ్బులు తీసుకుని.. అడిగినా ఇవ్వడం లేదని, పైగా తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని" యోగిపై హారిక గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హారిక ఫిర్యాదుతో యోగిని స్టేషన్‌కు పిలిపించగా.. పోలీసుల ఎదుటే హారికను యోగి అసభ్యకరంగా దూషించినట్టు సమాచారం. 
 
దీంతో చిర్రెత్తుకొచ్చిన అడిషినల్ డీసీపీ గంగిరెడ్డికి తనదైనశైలిలో యోగిని బుద్ధి చెప్పారు. బూటుకాలితో తన్నుతూ, చెంప పగులగొడుతూ తగిన విధంగా బుద్ధిచెప్పాడు. ఈ క్రమంలో యోగిపై గతంలో నమోదైన పాత కేసులను కూడా వెలికి తీస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు యోగి పోలీసుల అదుపులో ఉన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'హలో'పై కత్తి మహేష్ రివ్యూ... అతడలా చేసి వుంటే ఎవరూ మాట్లాడేవారు కాదు...