Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరసింహారెడ్డి కోసం భారీ ఫైట్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (16:54 IST)
Veerasimha Reddy
నటసింహ నందమూరి బాలకృష్ణ, గోప్‌చంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ వీరసింహారెడ్డి టైటిల్ పోస్టర్‌ తో అందరినీ అలరించింది. బాలకృష్ణకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.
 
ప్రస్తుతం బాలకృష్ణ,  విలన్ బ్యాచ్‌ పై ఉత్కంఠభరితమైన భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కథలో కీలకమైన సమయంలో రానున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ని దర్శకుడు అద్భుతమైన రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఫైట్ మాస్టర్ వెంకట్ ఫైట్ సీక్వెన్స్‌ని పర్యవేక్షిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
 
 ఈ చిత్రం కథ యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరసింహారెడ్డి 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
 బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ ఈ చిత్రానికిసంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు : ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments