Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ కుట్రల విషంతో నిండిన "వ్యూహం" : వర్మ వెల్లడి

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (16:17 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ మరో కొత్త సినిమాను నిర్మించనున్నారు. ఇందుకోసం ఆయన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. బుధవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా లంచ్ సమావేశం జరిపారు. అపుడే ఆయన ఓ సినిమా తీయనున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ ఊహించినట్టుగానే తాను కొత్త చిత్రం నిర్మించనున్నట్టు గురువారం ప్రకటించారు. ఇది రాజకీయ సినిమా అని సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే, ఇది బయోపిక్ కాదని, బయోపిక్ కంటే లోతైన రియల్ పిక్ అని వెల్లడించారు. 
 
బయోపిక్‌లో అయినా అబద్దాలు ఉంటాయేమో గానీ రియల్ పిక్‌లో నూటికి నూరుపాళ్ళు నిజాలే ఉంటాయని వెల్లడించారు. అహంకారానికి ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించినదే వ్యూహం కథ అని వర్మ వివరించారు. 
 
ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని, రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహాన్ని ప్రతిబింభించేలా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం వ్యూహం షాక్ నుంచి తేరుకునేలోపు రెండో భాగం శపథంలో మరో ఎలక్ట్రిక్ షాక్ తగులుతుందన్నారు. కాగా, తనతో వంగవీటి చిత్రాన్ని నిర్మించిన దాసరి కిరణ్ ఈ పొలిటికల్ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తారని వర్మ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments