ఆర్ఎక్స్ 100 హీరో బిజీ బిజీ.. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లతో..

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (11:08 IST)
'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ యూరప్ వెళ్తున్నాడు. కార్తికేయ హీరోగా రెండు సినిమాలు సెట్స్‌పైకి వచ్చాయి. వాటిలో ఒక సినిమా అనిల్ కడియాల- తిరుమల రెడ్డి నిర్మాణంలో అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తయ్యింది. ఈ సందర్భంగా కార్తీకేయ మాట్లాడుతూ.. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయ్యిందని చెప్పాడు. 
 
తదుపరి షెడ్యూల్‌ను మార్చి 5వ తేదీ నుంచి యూరప్‌లోని క్రొయోషియాలో ప్లాన్ చేసినట్లు తెలిపాడు. అక్కడ రెండు పాటలను చిత్రీకరించనున్నట్లు కార్తీకేయ అన్నాడు. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను 25 రోజుల పాటు ఒంగోలులో షూట్ చేసినట్లు వెల్లడించాడు. మరోవైపు ఆరెక్స్ మూవీ తర్వాత ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న హిప్పీ చిత్రంలో నటిస్తున్నాడు కార్తీకేయ. 
 
శ్రీలంక, తదితర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి థాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఇలా సినిమా షూటింగ్‌లతో కార్తీకేయ బిజీ బిజీగా గడుపుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు.. కొత్త ఉప ముఖ్యమంత్రిగా ఎవరంటే?

టూవీలర్ ఓవర్.. ఆటోలో ప్రేమ జంట రొమాన్స్.. వీడియో వైరల్

నీ ప్రియుడితో చల్లగా నూరేళ్లు వర్థిల్లు నా శ్రీమతి: ప్రియుడితో పెళ్లి చేసి భర్త సూసైడ్

Rahul Gandhi: ఈమె ఎవరో చెప్పండి.. విలేకరులను ప్రశ్నించిన రాహుల్ గాంధీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments