Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ వద్ద పైసా లేదట.. కానీ చేతికి రూ.3.82 లక్షల వాచ్ ఎలా?

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:18 IST)
సినీ హీరోలు ఏది మాట్లాడినా విశేషమే, ఏది చేసినా సంచలనమే. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమి చేసినా అది మీడియాకు హాట్ టాపిక్‌గా మారిపోతోంది. మొన్నటికి మొన్న పవన్ పెంచుకున్న గుబురు గడ్డం నుండి నిన్న నితిన్ ''అ.. ఆ...'' ఆడియో ఫంక్షన్‌లో పవన్ పెట్టుకొచ్చిన వాచీ వరకు అన్నీ సంచలనమే. 
 
అసలు విషయం ఏంటంటే ''అ.. ఆ...' ఆడియో ఫంక్షన్‌కి పవన్ ఛీఫ్ గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. ఆయన పెట్టుకొచ్చిన వాచీయే. ''సర్దార్ గబ్బర్ సింగ్'' రిలీజ్ టైంలో మీడియాతో మాట్లాడుతూ తన దగ్గర డబ్బుల్లేవని... సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వడం కష్టంగా ఉందని చెప్పిన పవన్ మాటలకు చేస్తున్న పనులకు ఏమాత్రం సంబంధం లేదని సినీజనాలు మండిపడుతున్నారు. 
 
''అ.. ఆ...' సినిమా ఆడియో లాంచ్‌కి వస్తూ ఖరీదైన వాచ్‌ని పెట్టుకొచ్చాడు. ఆ వాచ్ ధర అక్షరాలా మూడు లక్షలా 82 వేల రూపాయలట. ఆ ఫంక్షన్‌లో మీడియా పవన్ చేతికున్న వాచ్‌ పైనే దృష్టి సారించింది. దీనిపై కొంత మంది నెటిజన్లు విమర్శిస్తుండగా... ఫ్యాన్స్ మాత్రం సెలబ్రిటీ అన్నాక ఆ మాత్రం ఉండాలి కదాని అని సపోర్ట్ చేస్తున్నారు. 
 
ఇంత కష్టాల్లో ఉన్న పవన్ తన అత్తారింటికి తన కూతురు భార్య అన్నాతో కలిసి ఆస్ట్రేలియా ఫ్లైటెక్కుతున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. మూడు వారాలపాటు పవన్ ఫ్యామిలీతో ఆస్ట్రేలియాలో గడుపుతున్నాడట. దీనిపై ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి జ్యోతిర్మయి

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు - నలుగురి దుర్మరణం!!

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments