Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో: హీరో విశ్వక్ సేన్ పైన గావుకేకలు పెట్టిన లేడీ యాంకర్

Webdunia
సోమవారం, 2 మే 2022 (16:38 IST)
అశోకవనంలో అర్జున కళ్యాణం... ఈ చిత్రంలో విశ్వక్ సేన్ నటించాడు. త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ విషయంలో రచ్చరచ్చ అవుతోంది. నిన్ననే ప్రాంక్ వీడియో చేసిన చిత్ర బృందంపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు కూడా నమోదు చేసారు.

 
ఈరోజు ఓ ప్రముఖ ఛానల్లో యాంకర్‌తో మాట్లాడుతూ విశ్వక్ సదరు యాంకర్‌ను అభ్యంతరకర మాటను ఉపయోగించాడు. తనను డిప్రెషన్ పర్సన్, పాగల్ సేన్ అని పర్సనల్‌గా ఎందుకు వ్యాఖ్యానించారంటూ మైండ్ యువర్ టంగ్ అంటూ యాంకర్ పైన విరుచుకుపడ్డాడు. దీనితో సదరు యాంకర్ గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ గావుకేకలు పెట్టింది. ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.

 
నిజంగా విశ్వ‌క్‌సేన్ పాగ‌ల్ సేనా?
హీరో విశ్వ‌క్ సేన్ చేసిన ప‌నికి సినిమారంగంలో అంద‌రూ ముక్కున‌వేలేసుకుంటున్నారు. అంద‌రూ విమ‌ర్శిస్తున్నారు. ఈ ఉదంతంపై పోలీసు కేసు పెట్టాల‌ని కొంద‌రు తెలియ‌జేస్తున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే! హీరో విశ్వ‌క్ సేన్ మొద‌టి నుంచి డిఫ‌రెంట్ కేండెట్‌. సినిమా ప్ర‌మోష‌న్‌కు మీడియాను పిలిచి గంట‌లపాటు ఆల‌స్యంగా వ‌స్తుంటాడు. ఇక ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్ర విచిత్ర‌మైన ప‌నులు చేస్తుంటాడు. పెయిడ్ అభిమానులను మెయింటైన్ చేస్తుంటాడు.

 
 
విశ్వ‌క్‌సేన్‌తోపాటు వ‌చ్చిన అనుచ‌రులు కూడా కారులోంచి దిగి.. ఈయ‌నే నువ్వు కోరుకున్న వ్య‌క్తి అంటూ చెబుతారు. కానీ ఆ వ్య‌క్తి విన‌డు. ఈయ‌న హీరో విశ్వ‌క్ సేన్‌.. నాకు కావాల్సింది అర్జున‌కుమార్‌.. అంటూ డ‌బ్బా కిరోసిన్ మీద పోసుకుంటాడు. అంటించ‌మని అరుస్తుంటాడు. నేను ఆయ‌న‌కోస‌మే 34 ఏళ్ళుగా పెండ్లి చేసుకోలేదుంటూ ఏవోవే మాట్లాడుతంటాడు. చివ‌రికు ఆ వ్యక్తిని కారులో ఎక్కించుకుని అర్జున కుమార్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ‌తామ‌ని చెప్పి.. తీసుకెళ‌తారు.
 
ఇలాంటి.. ఇటీవ‌లే ఫేక్ వీడియోలు ఎక్కువ‌య్యాయి. ఆ త‌ర‌హాలో  విశ్వ‌క్ సేన్ చేసిన తంతు. అన తాజా సినిమా `అర్జున‌వ‌నంలో..` అనే సినిమా ప‌బ్లిసిటీ కోసం చేశాడు. దీంతో అక్క‌డివారితోపాటు సోష‌ల్‌మీడియాలోని వారితోపాటు ఇండ‌స్ట్రీలోని అంద‌రూ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నిజంగా విశ్వ‌క్‌సేన్ పాగ‌ల్ అంటూ కితాబిచ్చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments