Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రాన్ని చూసేందుకు థియేటర్లో ఒక్కరు లేరు.... స్టార్ హీరోకి మరీ ఇంత షాకా...

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (18:05 IST)
కొన్ని సినిమాలు ఎందుకు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడతాయో, ఇంకొన్ని సినిమాలు మరెందుకు కాసుల వర్షం కురిపిస్తాయో ఎవ్వరికీ అర్థంకాదు. దీనితో టాప్ స్టార్లు చాలామంది చాలాసార్లు చేదు గుళికలు మింగాల్సి వస్తుంది. తాజాగా అక్షయ్ కుమార్ పరిస్థితి అలా మారిందట.

 
సుమారు రూ. 300 కోట్ల భారీ వ్యయంతో అక్షయ్ కుమార్ హీరోగా సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం నిర్మించింది యశ్ రాజ్ ఫిల్మ్స్. చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఐతే వారం తిరిగేసరికల్లా సినిమా థియేటర్లలో ప్రేక్షకులే లేకుండా పోయారట.

 
ఈ పరిస్థితితో చాలాచోట్ల థియేటర్లలో షోలను నిలిపివేస్తున్నట్లు బాలీవుడ్ సినీవర్గాల భోగట్టా. ఆనాటి చరిత్రను ఇప్పటితరానికి కనెక్ట్ అయ్యేట్లు తీసేందుకు రూ. 300 కోట్లు ఖర్చుపెడితే ఇప్పటివరకూ రూ. 55 కోట్లు మాత్రమే వచ్చిందట. దీనితో ఎన్నో అంచనాలతో విడుదలైన సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం ఘోరంగా బాక్సాఫీస్ వద్ద బోర్లాపడినట్లయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments