Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాజీకి సీక్రెట్ టాస్క్.. చైన్ కూడా ఇచ్చిన బిగ్ బాస్

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (20:12 IST)
బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ దాదాపు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే సక్సెస్‌ ఫుల్‌‌గా 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్‌ షో 12 వారంలోకి అడుగుపెట్టింది.  
 
మొత్తం మీద గతవారం లాగే ఈ వారం కూడా 8 మంది ఇంటి సభ్యులు నామినేషన్స్‌లోకి వచ్చారు. శివాజీ, పల్లవి ప్రశాంత్‌, అమర్‌ దీప్‌ చౌదరి, అశ్విని శ్రీ, పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌, రతికా రోజ్‌, గౌతమ్‌ కృష్ణ, అంబటి అర్జున్‌ 12 వారం నామినేట్‌ అయిన కంటెస్టెంట్లలో ఉన్నారు. 
 
గత కొన్ని వారాలుగా సాగుతున్నట్లు 12 వారం ఓటింగ్‌లో శివాజీ టాప్‌ ప్లేస్‌లో లేడు. నిన్నటివరకు అమర్‌ దీప్‌ చౌదరి అగ్ర స్థానంలో ఉండగా తాజాగా పల్లవి ప్రశాంత్‌ టాప్‌ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. ఇక రెండో స్థానంలో శివాజీ కొనసాగుతున్నాడు. అతనికి 21 శాతం ఓట్లు పడ్డాయి. 
 
కాగా నిన్నటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన అమర్‌ దీప్‌ చౌదరి ఇప్పుడు మూడో ప్లేస్‌లోకి పడిపోయాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో శివాజీ, ప్రశాంత్ ఇద్దరిని కన్ఫెషన్ రూంకు పిలిచిన బిగ్‏బాస్ శివాజీకి సీక్రెట్ టాస్క్ గురించి మాట్లాడారు. అలాగే శివాజీకి ఓ చైన్ కూడా ఇవ్వడంతో ప్రోమో ముగిసింది.
 
తాజాగా విడుదలైన ప్రోమోలో విక్రమార్కుడు రవితేజను దించేశాడు అమర్ దీప్. మాస్ మాహారాజా నడక.. స్టైల్.. యాటిట్యూడ్.. కామెడీ టైమింగ్ అదరగొట్టేశాడు. ఇక కామెడీ టైమింగ్ పంచులతో శివాజీ రెచ్చిపోయాడు. ఇక యావర్, శోభా, రతిక, గౌతమ్ తమ పాత్రలలో జీవించేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments