Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఆయన అలాంటోడు కాదు.. మేలిమి బంగారం : శిల్పా శెట్టి

Webdunia
శనివారం, 24 జులై 2021 (16:33 IST)
అడల్ట్ కంటెంట్ కేసులో అరెస్టు అయిన తన భర్త రాజ్‌కుంద్రాకు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి క్లీన్‌‌‍చిట్ ఇచ్చింది. మా ఆయన అలాంటోడు కాదు.. బంగారం అంటూ కితాబిచ్చారు. పైగా, ఆయన తయారు చేసింది అడల్ట్ కంటెంట్ కాదనీ, వెబ్ సిరీస్‌లో కోసం శృంగారం సినిమాలు తీసినట్టు చెప్పుకొచ్చారు. ఈ కేసులో శిల్పాశెట్టిని కూడా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆరు గంటల పాటు విచారించారు. ఈ విచారణలోనే ఆమె ఈ విషయాలు వెల్లడించింది.
 
తన భర్తకు చెందిన హాట్ షాట్స్ అనే యాప్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యాప్‌తో తనకు లావాదేవీలు లేవని, యాప్ లాభాలూ తాను తీసుకోలేదని స్పష్టం చేసింది. పైగా, తన భర్త పోర్న్ సినిమాలు తీయడని, పోర్న్, శృంగార చిత్రాలు వేర్వేరని చెప్పుకొచ్చారు. హాట్ షాట్స్‌లో ఉండే కంటెంట్ ఏంటో కూడా తనకు తెలియదని చెప్పినట్టు సమాచారం. 
 
హాట్ షాట్ యాప్‌లోని కంటెంట్ గురించి తనకు తెలియదని, పోర్నోగ్రఫిక్ చిత్రాలను తీయడంలో తన భర్త పాత్ర ఏదీ లేదని ఆమె వెల్లడించింది. పైగా పోర్నోగ్రఫీకి, ఏరోటికాకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలని ఆమె చెప్పింది. ఎరోటికా కేవలం లైంగిక భావనలను రేకెత్తించేదని కానీ, పోర్నోగ్రఫీ అంటే అశ్లీల, అసభ్యకర చిత్రాలతో కూడుకున్నదని ఆమె వివరించింది. 
 
తన భర్త కేవలం ఎరోటికా మూవీలే తీసేవాడని పరోక్షంగా అంగీకరించింది. లండన్‌లో ఉంటున్న కుంద్రా బ్రదర్-ఇన్-లా (బావ) ప్రదీప్ బక్షి హాట్ షాట్ యాప్‌‍తో ఈ విధమైన (పోర్న్) చిత్రాలు తీస్తుంటాడని శిల్పా శెట్టి వెల్లడించింది. కానీ కుంద్రా మాత్రం ఇలాంటి మూవీలు తీయడని పేర్కొంది. 
 
ఇదిలావుంటే, కుంద్రాకు ఎస్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికాలలో ఉన్న ఖాతాలు ఉన్నండగా వాటి నుంచి రూ.7.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన బూతు చిత్రాల ప్రొడక్షన్, పంపిణీ, అమ్మకం తదితరాలపై చర్చించుకునేందుకు కుంద్రా వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ రీల్స్ చేసిన యువకుడు

ఠాణాలో అమానుషం - కాళ్లకు సంకెళ్లు వేసి చీపురుతో ఊడ్పించిన పోలీసులు...

తెలంగాణ లిఫ్ట్ ప్రమాదం- కమాండెంట్ మృతి.. ఎలా జరిగిందంటే?

ఔరంగజేబు సమాధానిని కూల్చివేయాలన్న బీజేపీ ఎంపీ.. మద్దతు తెలిపిన మహా సీఎం!!

Amrutha’s Son: అమృత - ప్రణయ్‌ దంపతుల ముద్దుల కుమారుడు.. వీడియోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

తర్వాతి కథనం