Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్ కుంద్రాకు మద్దతిచ్చిన శిల్పాశెట్టి.. నా భర్త అలా చేయలేదు..?

Advertiesment
రాజ్ కుంద్రాకు మద్దతిచ్చిన శిల్పాశెట్టి.. నా భర్త అలా చేయలేదు..?
, శనివారం, 24 జులై 2021 (13:50 IST)
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ప్రధాన నిందితుడిగా చేర్చి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించిన కేసుకు సంబంధించి విచారణ జరిపిన ముంబై కోర్టు శుక్రవారం వ్యాపారవేత్త మరియు అతని సహచరుడు రియాన్ తోర్పేను జూలై 27 వరకు పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు జులై 23న శిల్పాశెట్టి వాంగ్మూలం నమోదు చేశారు. అదే రోజు వారి జుహు ఇంట్లో కూడా పోలీసులు సోదాలు జరిపారు.
 
రాజ్ కుంద్రా యొక్క హాట్ షాట్ యాప్ కు సంబంధించి తనకు సంబంధం ఉందన్న విషయాన్ని నటి శిల్పాశెట్టి ఖండించినట్లు పోలీసుల సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో తన భర్త రాజ్ కుంద్రాకు నటి శిల్పాశెట్టి సపోర్ట్ చేసినట్లు మాట్లాడారు. ఎరోటికా పోర్న్ కంటే భిన్నమైనదని, తన భర్త ఎలాంటి పోర్నోగ్రఫీ కంటెంట్ తయారీలో పాల్గొనలేదని ఆమె తన భర్తకు మద్దతు ఇచ్చిందని తెలుస్తుంది. 
 
ఒక పక్క పోలీసులు రాజ్ కుంద్రా మోడల్స్ ను బెదిరించి పోర్న్ వీడియోలు తీసి, హాట్ షాట్ యాప్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్లారని, అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్తుండగా, తన భర్త ఎలాంటి అశ్లీల కంటెంట్ను ప్రొడ్యూస్ చేయలేదని, ఎరోటికాకు , పోర్న్ కు వ్యత్యాసం ఉంటుందని శిల్పా శెట్టి చెప్పినట్లుగా సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టేబుల్ టెన్నిస్ ఆడుతున్న లాల్‌సింగ్‌ చద్దా