Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల షాపింగ్‌పై స్నాప్‌డీల్ సెటైర్లు.. చురకలంటించిన చిన్మయి భర్త.. ఎందుకు?

స్నాప్‌డీల్ మహిళల షాపింగ్‌పై ట్వీట్ చేసి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఓ ప్రకటనలో భాగంగా మహిళల షాపింగ్‌ను ఉద్దేశించి స్నాప్ డీల్ ఓ ట్వీట్ చేసింది. జజ్బా సినిమాలో ఐశ్వర్యరాయ్‌ పరిగెడుతున్న వీడ

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (09:31 IST)
స్నాప్‌డీల్ మహిళల షాపింగ్‌పై ట్వీట్ చేసి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఓ ప్రకటనలో భాగంగా మహిళల షాపింగ్‌ను ఉద్దేశించి స్నాప్ డీల్ ఓ ట్వీట్ చేసింది. జజ్బా సినిమాలో ఐశ్వర్యరాయ్‌ పరిగెడుతున్న వీడియోను పోస్ట్ చేసి.. ఎంత షాపింగ్ చేసిందో భర్త తెలుసుకునే లోపే.. మహిళ డోర్ వద్దకు పరిగెడుతుంది... అని ట్వీట్ రాసింది ఇది మీకూ వర్తిస్తుందా అంటూ ప్రశ్నించింది. దీనిపై నటుడు రాహుల్ స్పందించాడు. 
 
గత ఏడాది తన సంపాదన కన్నా తన భార్య సంపాదన ఎక్కువ. చెప్పాలంటే ఆమె తనకంటే ఎక్కువ పన్ను చెల్లిస్తోందని చెప్పాడు. ఆమె తన ఆన్‌లైన్‌, ఇతర షాపింగ్‌లకు తన డబ్బులే వాడుతుంది. ఆమె ఎక్కడికీ పరిగెత్తాల్సిన అవసరం లేదని ట్వీట్‌ చేశారు. దీనికి ఆయన భార్య, ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ప్రతిస్పందించింది. 
 
ఇలాంటి భర్తను ప్రతి అమ్మాయి కోరుకుంటుందని చెప్పింది. రాహుల్ సమాధానానికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇది చిల్లర ప్రకటన అని కొందరు స్నాప్‌డీల్‌ను ఉద్దేశించి అన్నారు. మరికొందరు రాహుల్ ఆలోచనా విధానాన్ని అభినందించారు. రాహుల్ రవిచంద్రన్ (36), చిన్మయి శ్రీపాద (32) 2014లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాహుల్ అందాల రాక్షసి, అలా ఇలా, టైగర్ అనే తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ సినిమాల్లో నటించాడు. ఇక చిన్మయి నేపథ్య గాయనిగా మంచి పేరు కొట్టేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments