#PadiPadiLecheManasu ప్రీ ఈవెంట్‌కు బన్నీ-జై పవర్ స్టార్.. అన్న శర్వానంద్

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:29 IST)
పడి పడి లేచే మనసు సినిమా ప్రీ ఈవెంట్ ప్రోగ్రామ్ అట్టహాసంగా జరిగింది. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న పడి పడి లేచే మనసు సినిమాలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం హను రాఘవపూడి వహిస్తున్నారు. 
 
శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ సమకూర్చుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ ఈవెంట్ ఫంక్షన్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 
 
ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. బన్నీని లక్కీ హ్యాండ్ అంటూ పొగిడేశారు. ఆయన చీఫ్ గెస్ట్‌గా అటెండైన ఫంక్షన్లు సూపర్ హిట్ అవుతాయని.. ఇంకా సినిమాలు కూడా హిట్ కొడతాయన్నారు. ఇలా ఇప్పటికే విజయ్ దేవరకొండకు రెండు హిట్స్ ఇచ్చేశారని బన్నీకి కితాబిచ్చాడు. బన్నీ ఫ్యాన్సును డిసిప్లైన్‌కు పేరున్న వారని కొనియాడారు. ఇక పవన్ ఫ్యాన్స్‌ను కూడా ఆకాశానికి ఎత్తేశారు.
 
పవన్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేలా జై పవర్ స్టార్ అంటూ శర్వానంద్ ఫంక్షన్‌లో చెప్పారు. ఇంకో ఫంక్షన్‌కి ఆయన్ని కూడా పిలుద్దామన్నారు. కానీ ప్రస్తుతం చాలా బిజీగా వున్నారని చెప్పుకొచ్చారు. ఇక పడి పడి లేచే మనసు సినిమాను కథను ఆధారంగా తీసుకుని రూపొందించామన్నారు. సాయిపల్లవి గురించి చెప్పాలంటే.. మంచి ఫ్రెండ్ అన్నారు. అంకితంగా పనిచేసే అమ్మాయని ఫిదా హీరోయిన్‌ను శర్వానంద్ కొనియాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments