Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడేసుకుంటారు... మీరు మోసపోవద్దు.. యువతులకు షకీల్ సలహా

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (18:18 IST)
వెండితెర శృంగార తార "షకీలా". ఈమె జీవిత చరిత్ర ఆధారంగా ఆమె పేరుతోనే ఓ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఈ నెల 25 తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రిచా చద్దా నటించిన ఈ చిత్రానికి ఇంద్రజీత్ లంకేష్ దర్సకత్వం వహించారు. 
 
ఈ చిత్రం ప్రివ్యూ షోను తిలకించిన షకీలా... నేటి యువతకు ఓ సలహా ఇచ్చారు. "నేను బతికి ఉండగానే నా బయోపిక్‌ రూపొందడం ఎంతో ఆనందంగా ఉంది. రిచా చద్దా అద్భుతంగా నటించింది. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎన్నో బాధలుంటాయి. నేను గౌరవాన్నో, సానుభూతినో కోరుకోవడం లేదు. అయితే నాకు దక్కాల్సిన గౌరవం నాకు దక్కలేదని నేను భావిస్తాను. 
 
నా వెనుక నా గురించి మాట్లాడే వారి గురించి నేను బాధపడను. నా ముఖం మీద విమర్శించే ధైర్యం ఎవరికీ లేదు. ఇప్పుడు సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్స్‌, చదువుకుంటున్న అమ్మాయిలకు ఈ సినిమా ద్వారా నేను చెప్పేదొక్కటే నేను మోసపోయినట్లు మోసపోకండని. సినిమా చూశాను. కాస్త డ్రామా యాడ్‌ చేసిన మేకర్స్‌ మూవీ లిబర్టీ తీసుకుని సినిమాను తెరకెక్కించారు. మహిళలకు ఈ సినిమాలో సందేశం ఉంది" అన్నారు.
Shakeela
 
తెలుగులో మాత్రం శృంగార తార సిల్క్ స్మిత తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న సెక్స నటీమణుల్లో షకీలా ఒకరు. ఈమె సాధారణ స్టార్ నుంచి సూపర్ స్టార్‌గా ఎలా ఎదిగారన్నదనే ఈ చిత్రంలో చూపించారు. పైగా, షకీలా జీవించివుండగానే ఆమె జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం జాతీయ అభివృద్ధికి కీలకం

అసెంబ్లీకి రాను, మీడియా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తా: వైఎస్ జగన్

ఎవరైనా చెల్లి, తల్లి జోలికి వస్తే లాగి కొడ్తారు.. జగన్‌కి పౌరుషం రాలేదా? (video)

పసుపు చీరతో షర్మిల ఆకర్షించిందా.. విజయసాయికి బుద్ధుందా?: బుద్ధా వెంకన్న

ట్రోలింగ్‌తో నా కుమార్తెలు కన్నీళ్లు పెట్టుకున్నారు.. పవన్ కామెంట్స్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments