Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి అలా అన్నారు.... ఇకపై విలన్‌గా చేయనంటే చేయను : సోనూ సూద్

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (17:35 IST)
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఎంతో మందికి ఆపన్న హస్తం అందించి, రియల్ హీరో అనిపించుకున్న వెండితెర ప్రతినాయకుడు సోనూ సూద్. కోవిడ్ కోవిడ్ నేపథ్యంలో ఎంతో మంది ఆపన్నులకు అండగా నిలబడ్డారు. కరోనా లాక్డౌన్ సమయంలో కష్టాల్లో చిక్కుకున్న అనేక మందిని స్వస్థాలకు చేర్చి, ప్రభుత్వాలు చేయలేని పనిని చేసి చూపించారు. ముఖ్యంగా, తన సొంత ఖర్చులతో అనేక మందిని అనేక ప్రాంతాలకు తరలించారు. అలా ప్రతి ఒక్కరితో రియల్ హీరో అనిపించుకున్నారు. 
 
అలాంటి సోనూ సూద్ ఇకపై వెండితెరపై విలన్‌గా చేయనని తాజాగా వెల్లడించారు. పైగా, తాను అలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. 
 
ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్య' షూటింగులో సోనూసూద్‌ పాల్గొన్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ "చిరంజీవి సర్‌.. ఆచార్య సినిమా యాక్షన్‌ సన్నివేశంలో నన్ను కొట్టడానికి ఇబ్బంది పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. 
 
కోవిడ్‌ లాక్డౌన్ సమయంలో ఎంతో చేసి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నావు. నిన్ను కొడితే ప్రేక్షకులు నాపై కోపం పెంచుకుంటారు" అన్ని అన్నారు. 
 
అంతేకాకుండా ఇకపై తాను విలన్‌గా సినిమాలు చేయనని, హీరోగా అవకాశాలు వస్తున్నాయని సోనూసూద్‌ తెలిపారు. తన దగ్గర ఇప్పటికే నాలుగు స్క్రిప్ట్స్‌ ఉన్నాయని, కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభం చేద్దామనుకుంటున్నానని కూడా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments