Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌గ్యాజైస్వాల్ చేతుల మీదుగా ష‌క‌ల‌క‌శంక‌ర్ "బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది" చిత్ర టీజ‌ర్ విడుద‌ల‌

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (18:19 IST)
మ‌హంకాళి మూవీస్, మ‌హంకాళి దివాక‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ణిదీప్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై మ‌ధు, సోమేశ్ ముచ‌ర్ల నిర్మాత‌లుగా దత్తి సురేష్ బాబు నిర్మాణ నిర్వహణలో ప్ర‌ముఖ కామెడీ హీరో ష‌క‌ల‌క్ శంక‌ర్ లీడ్ రోల్‌లో రూపొందుతున్న రొమాంటిక్ హార‌ర్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది. నూత‌న ద‌ర్శ‌కుడు కుమార్ కోట ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది అనే క్యాచీ టైటిల్ తో అటు ఆడియెన్స్ ఇటు ఇండస్ట్రీ వ‌ర్గాల ఎటెన్ష‌న్ తెచ్చుకున్న ఈ చిత్ర బృందం ఆ త‌రువాత రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్స్‌తో కూడా అనూహ్య స్పంద‌న అందుకున్నారు.
 
ఈ నేప‌థ్యంలో యూనిట్ స‌భ్యులు తాజాగా టీజ‌ర్ సిద్ధం చేశారు. ప్ర‌‌ముఖ స్టార్ హీరోయిన్, హ్యాపెనింగ్ బ్యూటీ ప్ర‌గ్యాజైస్వాల్ ఈ టీజ‌ర్ ని విడుద‌ల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ముగిసింద‌ని, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని నిర్మాతలు లుకాలపు మధు, సోమేశ్ ముచ‌ర్ల తెలిపారు.
 
ష‌క‌ల‌క శంక‌ర్ మార్క్ కామెడీతో పాటు యూత్ ని ఆక‌ట్టుకునే అన్ని అంశాల‌తో ఈ సినిమాను అన్ని వ‌ర్గాలు ప్రేక్ష‌కుల్ని అల‌రించే రీతిన రూపొందిస్తున్న‌ట్లుగా ద‌ర్శ‌కుడు కుమార్ కోట తెలిపారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని డిసెంబ‌ర్ నెలాఖ‌రులో ఈ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హార‌ర్ కామెడీ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నట్లుగా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.
 
నటీనటులు: షకలక శంకర్, ప్రియ, అర్జున్ కళ్యాణ్, రాజ్ స్వరూప్, మధు, స్వాతి, అవంతిక, హీనా, రితిక చక్రవర్తి, సంజన చౌదరి.
 
సాంకేతిక వర్గం: సమర్పణ : మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్, బ్యానర్ : మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు : లుకాలపు మధు, సోమేశ్ ముచ్చర్ల, నిర్మాణ నిర్వాహణ : దత్తి సురేష్ బాబు, పీఆర్ఓ : మేఘశ్యామ్, లక్ష్మీ నివాస్, కెమెరామెన్ : ఫణింద్ర వర్మ అల్లూరి, మ్యూజిక్ : పిఆర్, 
స్టోరీ, డైలాగ్స్ :  విఎస్ రావ్, డైరెక్టర్ : కుమార్ కోట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments