Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఇది భలే ఛాన్స్... శకలక శంకర్

శంభో శంకర సినిమాతో హీరో అయిన శకలక శంకర్‌కు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. గత కొన్నిరోజులుగా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న శకలక శంకర్ పవన్ కళ్యాణ్‌‌ను పొగుడుతూ, కొంతమంది తారలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న విషయం తెలిసిందే. పవన్‌కు వీరాభి

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (20:26 IST)
శంభో శంకర సినిమాతో హీరో అయిన శకలక శంకర్‌కు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. గత కొన్నిరోజులుగా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న శకలక శంకర్ పవన్ కళ్యాణ్‌‌ను పొగుడుతూ, కొంతమంది తారలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న విషయం తెలిసిందే. పవన్‌కు వీరాభిమాని శకలక శంకర్. మొదట్లో కమెడియన్‌గా జబర్దస్త్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన శంకర్ ఆ తరువాత సినిమాల్లో కామెడీ స్కిట్లో చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఇప్పుడు ఏకంగా హీరో అయిపోయాడు.
 
అయితే శంకర్ హీరోగా అవడం సాటి కమెడియన్లకు ఇష్టమేగానీ ఆయన గత కొన్నిరోజులుగా కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారుతుండటం చర్చకు దారితీస్తోంది. తాజాగా షకలక శంకర్ వైసిపి ఎమ్మెల్యే, సినీ నటి రోజాను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. రోజా జనసేన పార్టీలోకి వచ్చేయాలి. ఆమెకు ఇది మంచి ఛాన్సు. మళ్ళీ ఆమెకు అలాంటి అవకాశం రాదు. 
 
ఒకవేళ రోజా జనసేనలో చేరకుంటే ఆమెను నేరుగా కలవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ వెంట నడవడానికి రోజానే కాదు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, నాగబాబు అందరూ రావాలంటూ వ్యాఖ్యలు చేశారు. శకలక శంకర్ వ్యాఖ్యలు కాస్త తీవ్ర దుమారానికి దారితీస్తోంది. ఐతే శకలక శంకర్‌ను హీరోగా కాకుండా పవన్ అభిమానిగా చూస్తే ప్రాబ్లెం లేదు కదా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు వెనక్కి వస్తుండగా బలంగా ఢీకొట్టిన ట్రక్కు... వీడియో వైరల్

న్యాయ విద్యార్థినిపై అఘాయిత్యం : నలుగురి అరెస్టు

మన్ కీ బాత్ తరహాలో డయలు యువర్ సీఎం : చంద్రబాబు వెల్లడి

రైలు ఆలస్యంగా వచ్చిదనీ రైలింజన్ కిటికీ అద్దాలు ధ్వంసం (Video)

కారంతో అభిషేకం చేయించుకున్న బాబా.. ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments