Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పళ్లు రాలగొట్టి చేతిలో పెడతా.. పబ్లిసిటీ కోసం ఆ హీరోకు భక్తుడవుతావా?: శ్రీరెడ్డి

క్యాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన శ్రీరెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది. కరెంట్ అఫైర్స్‌పై తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ వచ్చే ఈమె.. కమెడియన్ షకలక శంకర్‌ను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేసింది

Advertiesment
పళ్లు రాలగొట్టి చేతిలో పెడతా.. పబ్లిసిటీ కోసం ఆ హీరోకు భక్తుడవుతావా?: శ్రీరెడ్డి
, గురువారం, 5 జులై 2018 (10:55 IST)
క్యాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన శ్రీరెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది. కరెంట్ అఫైర్స్‌పై తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ వచ్చే ఈమె.. కమెడియన్ షకలక శంకర్‌ను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేసింది. అతడికి తనదైన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటిదాకా తాను పేరు సంపాదించుకునేందుకు, పైకి ఎదిగేందుకు ఎవరి పేరును బయటికి తేలేదు. ఇతరులపై ఆధారపడలేదు. 
 
కానీ ప్రస్తుతం ఓ హీరో (పవన్) భక్తుడుగా మారాడు. ఆ హీరోకి తెలుసో తెలియదో గానీ అతడి పేరు చెప్పుకొని అతడు రాజకీయంగా రాణించాలంటూ అతడిపై బతికేస్తున్నారు. తన పబ్లిసిటీ కోసం అతడి ఫ్యాన్స్‌ను కూడా వాడేస్తున్నారు. పబ్లిసిటీ కోసం వేరొకరి పేరుని వాడటం సబబు కాదు. పైగా తన పేరును కూడా మధ్యలో వాడుతున్నారు. ఇకపై అలా చేస్తే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా.. అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా అంటూ ఏదేదో వాగుతున్నావు. 
 
''కమెడియన్ నుంచి హీరోగా మారావు. నువ్వేం గొప్పోడివి కాదు.. నీ ప్రొడ్యూసర్ కూడా పెద్ద గొప్పోడు కాదు. మీ కథలు, మీ ప్రొడ్యూసర్ కథలు కూడా బయటకు వస్తాయి. మీ సినిమాల పబ్లిసిటీ కోసం పెద్ద హీరోల పేర్లు తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటున్నావ్.. ఇది చాలదన్నట్లు నా పేరును వాడుతున్నావ్. ఇక నా పేరు వచ్చిందంటే మాత్రం మర్యాదగా ఉండదు. అప్పుడొకసారి మర్యాద లేకుండా ఏకవచనంతో మాట్లాడావ్ జాగ్రత్తగా వుండు"అంటూ శ్రీరెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాసా... లవ్ బాసా? అతుక్కుపోయి చంపేస్తున్న సామ్రాట్-తేజస్వి