Webdunia - Bharat's app for daily news and videos

Install App

ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ధ‌ర్మ‌స్థ‌లి

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (17:20 IST)
Shakalaka Snankar, Dhramastali
హాస్య న‌టుడిగా కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ఒక భాద్య‌తాయుత‌మైన మంచి పాత్ర‌లో హీరోగా క‌నిపిస్తున్న చిత్రం ధ‌ర్మ‌స్థ‌లి. ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత ఎం ఆర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల తెలిసిన ర‌మ‌ణ మోగిలి ద‌ర్శ‌కుడు. పావ‌ని హీరోయిన్గా శంక‌ర్కి జోడిగా న‌టిస్తుంది. వినోద్ యాజ‌మాన్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి ధ‌ర్మ‌స్థ‌లి అని టైటిల్ని ఖ‌రారు చేశాము. ఈ టైటిల్ వెన‌క క‌థ స‌మాజంలో జ‌రిగే విషం లాంటి ఒక విష‌యాన్ని అంద‌రికి అర్ధ‌మ‌య్యేలా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మోగిలి తెర‌కెక్కిస్తున్నారు. ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఈ విష‌యాన్ని అంద‌రి అర్ద‌మ‌య్యేలా వుంటుంది అందుకే ఈ ధ‌ర్మ‌స్థ‌లి టైటిల్ కి ఖ‌రారు చేశారు. 
 
ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మోగిలి మాట్లాడుతూ.. ష‌క‌ల‌క శంక‌ర్తో ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి చిత్రాన్ని ఇలాంటి కాన్సెప్ట్ ని ఎవ‌రూ తెర‌కెక్కించ‌లేదు. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ చూసిన వారికి ఆయ‌న‌లో వున్న ఇంటెన్సిటి ఈ చిత్రం ద్వారా అర్ద‌మ‌వుతుంది. ప్ర‌తిరోజు మ‌న జీవితాల‌తో ముడి ప‌డిన ఓ విష‌యాన్ని అలాగే మ‌న జీవితాల‌తో ఆడుకుంటున్న అంశాన్ని ఆయ‌న పాత్ర ద్వారా తెలియ‌జేస్తున్నాం. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ మిస్ కాకుండా ఇంటెన్సిటిని తెర‌పైకి తీసువ‌స్తున్నాం. శంక‌ర్కి జోడిగా పావ‌ని న‌టిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ అకుతోట సంజు మాట్లాడుతూ, ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించే అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. ఇంత మంచి చిత్రానికి ద‌ర్శ‌స్థలి అనే టైటిల్ని ఖ‌రారు చేశాము. ఈ టైటిల్ని ఎనౌన్స్ చేయ‌గానే భారి బ‌డ్జెట్ చిత్రాల‌కి వ‌చ్చిన రెస్పాన్స్ రావ‌టం విశేషం. మ‌రిన్ని వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాము. ఈరోజు ఈ చిత్రం మెద‌టి లుక్ని విడుద‌ల చేశాము. అన్నారు.
 
న‌టీన‌టులు.. శంక‌ర్‌, పావ‌ని, మ‌ని భ‌ట్టాచార్య‌, స‌న్ని సింగ్‌, షియాజి షిండే, ధ‌న‌రాజ్‌, భూపాల్‌, భర‌త్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ముక్తార్‌, ఉన్ని కృష్ణ‌, ఘ‌ని, విజ‌య్ భాస్క‌ర్‌, మాధ‌వి, హ‌సిని, ర‌మ్య‌,స్వాతి త‌దిత‌రులు..
 
సాంకేతిక నిపుణులు.. రోచిశ్రీ మూవీస్ నిర్మాత‌.. యమ్.ఆర్. రావు, స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌కుడు.. ర‌మ‌ణ మొగిలి, మ్యూజిక్‌.. వినోద్ యాజ‌మాన్య‌, స్టోరి, స్క్రీన్‌ప్లే,మాట‌లు- రాజేంద్ర భ‌రధ్వాజ్‌, కెమెరా.. జి ఎల్ బాబు, ఎడిట‌ర్.. వి.నాగిరెడ్డి, వి ఎఫ్ ఎక్స్‌.. అనంత్ ఇయ్యిని, ఫైట్స్‌.. మ‌ల్లేష్‌, డాన్స్‌..చంద్ర కిర‌ణ్‌, ఆర్ట్‌.. సాంబ‌, లిరిక్స్‌.. గోసాల రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. అకుతోట సంజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments