సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలుచేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన `నారప్ప` టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ మూవీ షూటింగ్ జనవరి 31తో పూర్తికానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మే 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
విక్టరీ వెంకటేష్, ప్రియమణి, కార్తిక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, కథ: వెట్రిమారన్, స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్, లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ శంకర్ డొంకాడ, కో- ప్రొడ్యూసర్: దేవి శ్రీదేవి సతీష్ నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.