శ్రీవారి సేవలో పాల్గొన్న 'జవాన్' - వెంట నయనతార కూడా..

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (09:16 IST)
బాలీవుడ్ అగ్రనటుడు షారూక్ ఖాన్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తన భార్య, కుమార్తెతో కలిసి మంగళవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు షారూక్‌కు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ నెల 7వ తేదీన "జవాన్" విడుదల కానుండటంతో తిరుమలకు వచ్చిన ఆయన... స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో షారూక్ దంపతులతో 'జవాన్' చిత్ర హీరోయిన్ నయనతార కూడా ఉన్నారు. 
 
షారూఖ్ ఖాన్, భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్‌, నటి నయనతారతో కలిసి వచ్చిన ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తొలుత దేవస్థానం అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. ఆ తర్వాత షారూక్ గర్భాలయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు పండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తాను హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటించిన "జవాన్" చిత్రం ఈ నెల 7వ తేదీన విడుదలకానుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మటన్ కూరలో కారం ఎక్కువైందని భర్త మందలింపు.. భార్య సూసైడ్... మనస్తాపంతో భర్త కూడా

Kavitha: ఆంధ్ర రాజకీయ నాయకులు మాటలు నచ్చవు.. అదేంటి అలా తిట్టుకోవడం?

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments