Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. చిన్నతనంలో నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను: సోనమ్ కపూర్

అంద‌రి అమ్మాయిల్లానే తాను కూడా యుక్త వ‌య‌సులో లైంగిక వేధింపుల‌కు గుర‌య్యానని నటి తాప్సీ తెలిపింది. కాలేజ్ డేస్ లో చాలాసార్లు ర్యాగింగ్‌కు గుర‌య్యాన‌ని తాప్సీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఓ స

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (15:18 IST)
అంద‌రి అమ్మాయిల్లానే తాను కూడా యుక్త వ‌య‌సులో లైంగిక వేధింపుల‌కు గుర‌య్యానని నటి తాప్సీ తెలిపింది. కాలేజ్ డేస్ లో చాలాసార్లు ర్యాగింగ్‌కు గుర‌య్యాన‌ని తాప్సీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఓ స్టార్ కుమార్తె.. ప్రస్తుత బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా చిన్నతనంలోనే తాను లైంగిక వేధింపులకు గురైందట. ఈ విషయాన్ని అనుష్క శర్మ, విద్యాబాలన్, రాధికా ఆప్టే, ఆలియాభట్‌లతో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సోనమ్‌ వెల్లడించింది. మొదటినుంచి చాలా నిర్మొహమాటంగా మాట్లాడతారన్న పేరున్న సోనమ్‌ ఇక్కడ కూడా తనదైన శైలిలో కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు.
 
ఈ సమావేశంలో సినీ విమర్శకుడు రాజీవ్‌ మసంద్‌తో సోనమ్‌ మాట్లాడుతూ.. 'నాకు తెలుసు. చిన్నవయసులోనే నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. ఆ అనుభవం చాలా బాధాకరంగా ఉంటుంది' అన్నారు. నటుడు అనిల్‌ కపూర్‌ కుమార్తె అయినప్పటికీ సోనమ్ కపూర్ చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యానని పబ్లిక్‌గా చెప్పడంతో సినీ ఇండస్ట్రీతో పాటు ఆమె అభిమానులు షాక్ తిన్నారు. 
 
2016 సంవత్సరంలో బాలీవుడ్‌లో తమ నటనా సామర్థ్యంతో మంచి విజయాలు సాధించిన నటీమణులతో రాజీవ్‌ మసంద్‌ ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమం ద్వారా తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకోవడంతో మిగిలిన మహిళల్లో చైతన్యం నింపగలనని సోనమ్ వెల్లడించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మూసీ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు.. తప్పుబట్టిన దానం నాగేందర్

మాజీ మంత్రి ఆళ్ల నానిపై చీటింగ్ కేసు.. కోర్టుకెక్కిన నాగమణి

తిరుమల శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్

పవన్ కల్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేసిన వృద్ధురాలు.. నా కుమారుడు అంటూ..? (video)

సీఎం కుర్చీలో కూర్చోవాలనే ఆకాంక్ష నాకు లేదు- పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం