Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపాల్ బాటలో మీరాజాస్మిన్.. ఏడాది పాటు భర్తతో విభేదాలు.. విడాకులు?

అమలాపాల్ విడాకుల వ్యవహారం సద్దుమణిగిన నేపథ్యంలో మరో దక్షిణాది హీరోయిన్ మీరా జాస్మిన్ విడాకులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 2014లో అనూహ్యంగా దుబాయ్‌కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌ను

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (14:52 IST)
అమలాపాల్ విడాకుల వ్యవహారం సద్దుమణిగిన నేపథ్యంలో మరో దక్షిణాది హీరోయిన్ మీరా జాస్మిన్ విడాకులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 2014లో అనూహ్యంగా దుబాయ్‌కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌ను పెళ్లాడిన మీరా జాస్మిన్ ఇటీవలే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది భాషల్లో నటించిన ఈ భామ... పెళ్ళికి తర్వాత సినిమాలకు దూరమైంది.
 
అయితే భర్తతో ఏడాది పాటు విభేదాలు తలెత్తడంతో విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తెలుగులో భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మలయాళ కుట్టి మళ్లీ కెరీర్‌లో దృష్టి పెట్టిందని తెలుస్తోంది. పెళ్లి తర్వాత దుబాయ్ లో సెటిల్ అయిన మీరా ఇటీవల 'పతూ కల్పనకల్' అనే చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
 
మరోవైపు ఇటీవల మీడియాతో మాట్లాడిన మీరా జాస్మిన్ తన నిర్ణయాల పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది. సినీ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ వందశాతం సంతోషంగా ఉన్నానని మీరా జాస్మిన్ వ్యాఖ్యానించింది. కానీ విడాకులకు సంబంధించి మీరా జాస్మిన్ ఇంకా స్పందించలేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments