Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీపార్వతి నిజస్వరూపం తెలిసి దిగ్భ్రాంతి చెందిన ఎన్టీఆర్: డ్రైవర్ లక్ష్మణ్

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (10:57 IST)
లక్ష్మీపార్వతి... దివంగత నందమూరి తారకరామారావు జీవిత భాగస్వామి... వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తీసిన "లక్ష్మీస్ ఎన్టీఆర్" పుణ్యమా అని మళ్లీ అందరి నోళ్లల్లో నానుతున్న విషయం తెలిసిందే. కాగా... స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోని చివరి అంకం సంచలనాలను సృష్టించడం మాత్రమే కాకుండా, తీవ్ర విమర్శల పాలు చేసింది కూడా ఈవిడే. 
 
లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకోవడం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఎవరికీ ఇష్టంలేకపోయినా ఎన్టీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆయన కుటుంబాన్ని రెండుగా చీల్చి వేసింది. అయితే, కాలక్రమంలో లక్ష్మీపార్వతి నిజస్వరూపం తెలిసి ఎన్టీఆర్ ఎంతో ఆవేదనకు గురయ్యారనీ, ఇలాంటి వ్యక్తి కోసమా తాను కుటుంబ సభ్యులను దూరం చేసుకుంది అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసారని ఆయన పర్సనల్ డ్రైవర్ లక్ష్మణ్ తెలిపారు.
 
"ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నేను, నా పిల్లలు మొత్తుకుంటున్నా వినకుండా ఈమెను చేసుకుని ఎంత తప్పు చేశాను" అంటూ రామారావు బాధపడ్డారని ఈ సందర్భంగా లక్ష్మణ్ వెల్లడించారు. ఒకరకంగా లక్ష్మీపార్వతి రాకతోనే ఎన్టీఆర్ పతనం ప్రారంభమైందని డ్రైవర్ లక్ష్మణ్  విచారం వ్యక్తం చేసారు. అమెరికాలో ఉంటున్న చిన్నకుమార్తె ఉమామహేశ్వరి కోసం రోడ్ నం.13లో ఎన్టీఆర్ ఒక ఇల్లు కొన్నారని, దాని పక్కనే మరో ఇంటిని కొనుగోలు చేసి లక్ష్మీపార్వతికి ఇచ్చారని కూడా ఆయన వివరించారు. మరి ఆర్జీవీ ఈ సందర్భంగా పార్ట్ 2 పేరిట.. మరో సినిమా కూడా తీసేస్తాడేమో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments